ENGLISH

విజయ్ అశ్లీల ఫోటోలని బయటపెట్టిన వనిత

16 December 2017-17:52 PM

కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతున్నది.  విజయ్ చనిపోవడానికి ఆయన భార్య వనిత రెడ్డి మరొక ఇద్దరు కారణమని తను చనిపోయే ముందు ఒక వీడియో తీసి పెట్టి మరి చనిపోయాడు విజయ్.

ఇక విజయ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనిత రెడ్డి, ఆమె న్యాయవాది మరొక వ్యక్తి పైన కేసు నమోదు చేసి పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు పరారిలో ఉండటంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఇదిలావుండగా కొద్దిసేపటి క్రితం వనిత రెడ్డి ఒక సేల్ఫీ వీడియో మీడియాకి పంపడంతో ఈ కేసులో ఎవరు ఊహంచని ట్విస్ట్ వచ్చింది. 

ఆ వీడియోలో వనిత మాట్లాడుతూ- తాను ఏమి తప్పు చేయలేదు అని, ఇక విజయ్ ఆత్మహత్యకి తనకి ఎటువంటి సంబంధం లేనే లేదు అని తేల్చి చెప్పింది. కేవలం తన కూతురి కోసమే తాను ఇలా ఎవరికి చెప్పకుండా వచేశాను అని తెలిపింది. పైగా తన భర్త తరపు వారు మొత్తం తప్పు నాపైనే వేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పింది. అయితే తనకి కావాల్సిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్టు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇవ్వన్ని పక్కకి పెడితే, విజయ్ ఒక అమ్మాయితో శారీరకంగా సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన రెండు ఫోటోలని కూడా మీడియా కి విడుదల చేసింది.

ఇక ఈ ఫోటోలు భయతకి రావడంతో కేసు సరికొత్త మలుపు తిరిగినట్టయింది. మరి ఇప్పుడు పోలీసులు ఈ కేసుని ఎలా చేదిస్తారు అన్నది ఆసక్తిగా మారింది.

 

ALSO READ: నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న అనసూయ?!