ENGLISH

విజయ్‌ 'బంగారు కొండ'

16 July 2018-11:02 AM

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులొస్తే, వాటిని తమకి నచ్చిన వారికి అంకితమిస్తారు కొంతమంది. కొంచెం కొత్తగా ఆలోచించాడు విజయ్‌ దేవరకొండ. తనకొచ్చిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్ని వేలం వేశాడు. 25 లక్షలు వచ్చాయి. ఆ 25 లక్షల్నీ సేవా కార్యక్రమాల కోసం వినియోగించాడు. 

5 లక్షలతో వేలం మొదలైంది. 25 లక్షలకు చేరుకుంది. ఓ మంచి కార్యక్రమం కోసం విజయ్‌ చేసిన ఈ పనిని ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. సేవా కార్యక్రమాల విషయంలో సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఈ తరం యంగ్‌ హీరోస్‌కి విజయ్‌ దేవరకొండ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

ఓ వైపు సక్సెస్‌లు, అందరి మన్ననలు పొందే ఇలాంటి సేవా కార్యక్రమాలతో విజయ్‌ దేవరకొండ అందితోనూ 'బంగారు కొండ' అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం యంగ్‌ హీరోస్‌లో బిజీ బిజీగా గడుపుతున్న హీరో విజయ్‌ దేవరకొండ. 'పెళ్లి చూపులు' సినిమాతో రాత్రికి రాత్రే సెన్సేషనల్‌ స్టార్‌ అయిపోయిన విజయ్‌ దేవరకొండ, ఆ తర్వాతి నుండీ వరుసగా క్రేజీయెస్ట్‌ ఆఫర్లు దక్కించుకుంటూ ఫుల్‌ బిజీగా గడుపుతున్నాడు. 

ఇప్పుడు విజయ్‌ దేవరకొండ చేతిలో ఆరడజను ప్రాజెక్టుల వరకూ ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవల 'మహానటి'తో విజయం అందుకున్నాడు. విజయ్‌ నటించిన 'టాక్సీవాలా' చిత్రం షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. రష్మికా - విజయ్‌ జంటగా తెరకెక్కిన 'గీతా గోవిందం' రేపో మాపో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాక 'నోటా', 'డియర్‌ కామ్రేడ్‌' తదితర చిత్రాలు విజయ్‌ చేతిలో ఉన్నాయి.

 

ALSO READ: టాక్ అఫ్ ది వీక్- విజేత, RX 100 & చినబాబు