ENGLISH

ఈ హాటు సుందరికి లక్కు కలిసొచ్చేనా?

11 August 2017-11:42 AM

ముద్దుగుమ్మ శ్రద్దా దాస్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరే. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కానీ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనిపించుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కూడా బిజీగా సినిమాలు చేస్తోంది. కానీ అంతంత మాత్రంగానే పాపులర్‌ అయ్యింది ఈ హాట్‌ బ్యూటీ. లేటెస్టుగా 'బాబూమొషాయ్‌ బందూక్‌ రాజ్‌' సినిమాలో సూపర్బ్‌ హాట్‌ సాంగ్‌ చేసేసింది. విపరీతంగా అందాలను ఆరబోసేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ సినిమా ఇప్పటికే వివాదాల్లోకెక్కింది. 48 కటింగ్స్‌ ఇచ్చింది సెన్సార్‌ బోర్డ్‌. దాంతో చిత్ర యూనిట్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బోల్డ్‌ సన్నివేశాలు, బూతు డైలాగులు ఈ సినిమాలో చాలానే ఉంటాయట. వాటన్నిటికీ మించి శ్రద్ధా దాస్‌ ఓ పాటలో విచ్చలవిడి అందాల ఆరబోత చేసిందని సమాచారమ్‌. ఇఫ్పుడు ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మరో పక్క ముద్దుగుమ్మ శ్రద్దా ఈ పాటతో తన దశ తిరుగుతుందని అంటోంది. తెలుగులో 'సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం' సహా పలు సినిమాల్లో నటించినా, సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. నవాజుద్దీన్‌ సిద్దిఖీ, బిదితా బాగ్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోంది ఈ సినిమా.

ALSO READ: సమంత - చైతూ పెళ్లి శుభలేఖ ఇది నిజమేనా?