ENGLISH

ప్రముఖ నటి భానుప్రియ ఇంట్లో పెను విషాదం..!

03 February 2018-17:07 PM

మాజీ హీరోయిన్ భానుప్రియ మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ ఈమధ్యనే మృతిచెందారు. 

తెలియవస్తున్న సమాచారం ప్రకారం, అమెరికాలో నివాసం ఉంటున్న ఆదర్శ్ కౌశల్ గత కొంతకాలంగా గుండె సంబధిత వ్యాధితో బాధపడుతున్నాడట. ఇక ఇదే వ్యాదితో ఈ మధ్యనే ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా తెలిసింది. విషయం తెలియగానే భానుప్రియ తన కూతురితో సహా అమెరికా ప్రయాణం అయిందట. 

ఇక 1998లో అమెరికాలో స్థిరపడ్డ ఆదర్శ్ కౌశల్ ని వివాహమాడిన భానుప్రియ, 2003లో అభినయ అనే పాప వీరికి జన్మిచ్చింది. అయితే వీరి మధ్య తలెత్తిన భేధాబిప్రాయల వలన వీరిద్దరూ 2005లో వీరు విడాకులు తీసుకున్నారు. 

ప్రస్తుతం భానుప్రియ తన కూతురు అభినయతో కలిసి ఇండియాలోనే నివాసముంటున్నది.

 

ALSO READ: రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్‌ మూవీ రివ్యూ & రేటింగ్స్