ENGLISH

ఇంటెలిజెంట్ మూవీ రివ్యూ & రేటింగ్స్

09 February 2018-13:47 PM

తారాగణం: సాయి ధరం తేజ్, లావణ్య,నాజర్, బ్రహ్మానందం, పోసాని తదితరులు
నిర్మాణ సంస్థ: CK ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: విశ్వేశ్వర్
ఎడిటర్: గౌతమ్ రాజు
కథ: ఆకుల శివ
నిర్మాత: C కళ్యాణ్
కథనం-దర్శకత్వం: VV వినాయక్  

రేటింగ్: 1.5/5

వరుస ఫ్లాపులతో కెరీర్ లో బాగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న హీరో సాయి ధరం తేజ్. ఇటువంటి హీరోకి ఒక మంచి కమర్షియల్ స్పెషలిస్ట్ డైరెక్టర్ తో సినిమా కుదిరితే సహజంగానే ఆ సినిమా పైన ఆ హీరో తో పాటు సామాన్య ప్రేక్షకులకి కూడా అంచనాలు పెరుగుతాయి.
మరి ఆ అంచనాలని ఈ ‘ఇంటలిజెంట్’ అందుకుందా లేదా అన్నది ఈ క్రింద సమీక్షలో చూద్దాం...

కథ:

సాయి ధరం తేజ్ తన చిన్నతనం నుండే చుట్టూ ఉన్నవారికి మంచి చేస్తే అదే సమాజానికి మంచి అని నమ్మే నాజర్ మాటలకి ఆకర్షితుడవుతాడు. నాజర్ ప్రోద్బలంతో బాగా చదువుకుని ఆయన సంస్థలోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవుతాడు.

అయితే బిజినెస్ లో ఆదర్శాలు పాటిస్తూ తమ సంస్థల మనుగడకే ప్రశ్నార్ధకంగా మారిన నాజర్ సంస్థని ఎలాగైనా అతడి నుండి లాక్కోవాలనే ఉద్దేశ్యంతో ఆయన పోటీదారులు విక్కీ భాయి అనే మాఫియా డాన్ సహాయం కోరతారు. విక్కి తన మనుషులని పంపి నాజర్ ని బెదిరించడం దానికి ఆయన తలొగ్గకపోవడం జరుగుతుంది. ఇది జరిగాక, ఒక రోజు ఆయన తన కంపెనీ ని విక్కీ భాయికి రాసిచ్చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు.

దీనికి కారణమైన వారి అంతుచూడడానికి ధర్మా భాయిగా మారతాడు హీరో. విక్కి భాయిని ఎలా పట్టుకున్నాడు? నాజర్ చనిపోవడానికి కారణమేంటి? ఇవి తెరపైన చూడాల్సిందే..

నటీనటుల ప్రతిభ:

సాయి ధరం తేజ్: తన పాత్ర వరకు బాగానే చేశాడు. అయితే తన నటన చూపెట్టడానికి ఎక్కడ కూడా ఆస్కారం ఈ కథలో లేకపోవడం దురదృష్టం.

లావణ్య: ఈమె పరిస్థితి అయితే మూడు సీనులు నాలుగు పాటలు అన్న విధంగా ఉంది.

నాజర్, సప్తగిరి, బ్రహ్మానందం, రాహుల్ రామకృష్ణ తమ తమ చిట్టి పాత్రలకి తమవంతు న్యాయం చేశారు.

ఇక రచయత ఆకుల శివ పోషించిన కాంట్రాక్ట్ కిల్లర్ పాత్ర చూడడానికి వింతగా ఉన్నప్పట్టికీ కొంతవరకు ప్రేక్షకుల దృష్టిని ఆ పాత్ర వైపుకి తిరిగేలా చేసింది.

విశ్లేషణ:

వీవీ వినాయక్ కి కమర్షియల్ స్పెషలిస్ట్ దర్శకుడిగా ఒక మంచి పేరుంది. అంతటి ప్రతిభ కలిగిన దర్శకుడు కూడా ఈ చిత్రాన్ని గట్టేకించలేకపోయాడు. కారణం- బలహీనమైన కథ, కథనం. తనకున్న అనుభవం మొత్తం పెట్టి ప్రయత్నం చేసిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం కూడా మెప్పించలేకపోయింది.

ఎంటర్టైన్మెంట్ మరియు యాక్షన్ కలిపి తనదైన శైలిలో చిత్రీకరించే వినాయక్ ఈ సినిమాలో కూడా అదే ప్రయత్నం చేయగా బలహీనమైన కథ, కథనాల వల్ల అది సాధ్యపడలేదు. ఇక ఈ చిత్రంలో మొదటినుండి ఆకర్షణ అనుకున్న చిరంజీవి చమక్ చమక్ చమ్ పాట చిత్రీకరణ అలాగే ఆ పాటలో హీరో-హీరోయిన్ చేసిన డ్యాన్సులు ఆ పాట పైన ఉన్న అంచనాలని తలక్రిందులు చేసేసింది. ఈ పాట ఎప్పుడు అయిపోతుంది అన్న భావన ఈ పాత మొదలైన 30 సెకన్ల కే అనిపించింది అంటే ఈ పాట ఎలా ఉందొ అర్ధంచేసుకోవచ్చు.

ఇక ఈ చిత్రం సాయి ధరం ఖాతాలో మరో ఫ్లాప్ గా నమోదు అవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది.

సాంకేతిక వర్గం:

విశ్వేశ్వర్ అందించిన ఛాయాగ్రహణం ఒకే అనిపిస్తుంది. తమన్ నేపధ్య సంగీతం, పాటలు యావరేజ్ అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్:

+ సప్తగిరి కామెడీ

మైనస్ పాయింట్స్:

- చాలా ఉన్నాయి..

ఆఖరి మాట: మీరు ‘ఇంటెలిజెంట్’ అయితే ఈ చిత్రాన్ని చూడరు...

రివ్యూ బై సందీప్

 

ALSO READ: ఇంటెలిజెంట్ ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి