ENGLISH

సినిమాలపై సంచలన నిర్ణయం తీసుకున్న కమల్ హాసన్..!

14 February 2018-13:26 PM

ఈమధ్యకాలంలో సినీరంగం నుండి రాజకీయాల్లోకి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నది. అందులో భాగంగానే ఈ మధ్యనే రాజకీయాల్లోకి వచ్చిన నటుడు కమల్ హసన్. 

కమల్ హసన్ ఈ మధ్యనే తమిళనాడులో ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నట్టుగా ప్రకటించడం త్వరలోనే తన పార్టీ గుర్తుని, ఎజెండాని ప్రకటిస్తాను అని తెలియచేశాడు. ఇక ఈ తరుణంలో ఆయన భవిష్యత్తులో సినిమాలలో నటిస్తారా లేదా అనే ప్రశ్నని విలేఖరులు అడగగా- తాను ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాల మినహా మరే చిత్రంలోను నటించబోను అని తేల్చి చెప్పేశాడు. 

దీనితో ఆయన యాక్టింగ్ కెరీర్ కి స్వస్తి పలకబోతున్నట్టు చెప్పకనే చెప్పేశాడు. ఈ నిర్ణయంతో కమల్ హసన్ మన దగ్గర పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వంటిదే తీసుకున్నాడు. 

మొత్తానికి స్టార్ హీరోలు నటనకి స్వస్తి పలికి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.

 

ALSO READ: యూట్యూబ్ సెన్సేషన్ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ పై పోలీస్ కేసు