ENGLISH

పైసావసూల్‌: లైక్‌ ఎన్టీయార్‌ లైక్‌ బాలయ్య

23 August 2017-18:14 PM

'పైసా వసూల్‌' నుండి మరో సాంగ్‌ టీజర్‌ వచ్చింది. ఈ సాంగ్‌లో బాలయ్య చాలా కొత్తగా కనిపిస్తున్నారు. 'కొంటె నవ్వు' అంటూ సాగే ఈ పాటలో నందమూరి బాలకృష్ణ, ముద్దుగుమ్మ ముస్కాన్‌తో ఆడి పాడుతున్నారు. ఓల్డ్‌ వెర్షన్‌లో బాలయ్య గెటప్‌ ఉంది ఈ పాటలో. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావుని ఇమిటేట్‌ చేశారు. అప్పట్లో ఎన్టీయార్‌ ట్రెండ్‌గా నడిచిన ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్‌లో బాలయ్య భలేగా కనిపిస్తూ కనువించు చేశారు ఈ పాటలో. ఈ పాటతో నందమూరి అభిమానులు స్వర్గీయ ఎన్టీఆర్‌ని తలంపుకు తెచ్చుకుంటున్నారు. పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే యాక్షన్‌ టీజర్స్‌తో దుమ్ము లేపేస్తోన్న బాలయ్య, ఇప్పుడు సాంగ్‌ టీజర్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. మొన్న రిలీజైన సాంగ్‌లో ముద్దుగుమ్మ శ్రియతో రొమాన్స్‌ చేశారు బాలకృష్ణ. కూల్‌ మెలోడి సాంగ్‌ అది. ఈ లేటెస్ట్‌ సాంగ్‌లో స్వర్గీయ ఎన్టీఆర్‌ స్టెప్పులతో కొత్త ఊపు తెస్తున్నారు. గతంలో హరికృష్ణ కూడా ఇదే తరహాలో ఓ పిల్లా.. అమ్మతోడు అయ్యతోడు.. అంటూ ఇలాగే స్వర్గీయ ఎన్టీఆర్‌ కాస్య్టూమ్‌లో ఆయన్ని ఇమిటేట్‌ చేస్తూ, హీరోయిన్‌ సిమ్రాన్‌తో స్టెప్పులేశారు. అదే తరహాలో ఇప్పుడు బాలయ్య పాట కూడా అభిమానుల్లో అదే జోష్‌ని నింపుతోంది. పూరీ అన్నట్లుగానే మాట నిలబెట్టుకునేలానే ఉన్నాడు. బాలయ్యని చాలా కొత్త యాంగిల్‌లో చూపిస్తున్నాడు. కైరాదత్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో.

ALSO READ: మెగాస్టార్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చెల్లెలు