ENGLISH

మహేష్ కత్తి ‘మెసేజుల’ కలకలం

19 January 2018-14:54 PM

పవన్ కళ్యాణ్ అభిమానులతో గొడవతో సామాన్య స్థాయి నుండి ఒక సెలబ్రిటీ స్థాయి వరకు ఎదిగిపోయాడు మహేష్ కత్తి. ఇక ఈ అంశంలో, ఈయనకి మద్దతుగా అలాగే వ్యతిరేకంగా మాట్లాడే వారు ఉండడంతో రోజురోజుకి ఈ అంశం ముదిరిపోతున్నది.

ఇక ఈ సమయంలో మహేష్ కత్తితో పనిచేసిన ఓ నిర్మాత మహేష్ కత్తి పై చేసిన కొన్ని ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఆరోపణలకి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ సదరు వ్యక్తి చెప్పడం, ఆధారాలు ఉంటే బయటపెట్టండి అంటూ మహేష్ కత్తి సదరు ఆరోపణలకి బదులుగా చెప్పాడు.

ఇదే సమయంలో తనకి నచ్చిన అమ్మాయిలకి- నువ్వు అంటే నాకు ఆసక్తి అని కాని నువ్వు అంటే నాకు ఇష్టం అని కాని మెసేజ్ చేసి ఉండొచ్చు అయితే వారిని తనతో ఉండమని ఎప్పుడు బలవంత పెట్టలేదు అని చెప్పుకొచ్చాడు. అమ్మాయిలకి ఇష్టం లేకుండా తాను ఎప్పుడు ఎవ్వరిని బలవంతం చేయలేదు అని చెప్పాడు.

అందుకే తనని “వుమెనైజర్” అంటూ అనడం సరికాదు అని ఆయన చేసినదాన్ని సమర్ధించుకున్నాడు. అలాగే ఒక మనిషి తాగుబోతు, తిరుగుబోతు అయినంత మాత్రాన తనకి హక్కులు ఉండవా అని ఎదురు ప్రశ్నించాడు. ఇవ్వన్ని అటుంచితే మహేష్ కత్తి చేసిన మెసేజులు ఇవే అంటూ ఒక వెబ్ సైట్ కొన్ని స్క్రీన్ షాట్స్ ని పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ మొత్తం ఎపిసోడ్ ని చూస్తున్న ప్రేక్షకులు మాత్రం రోజు మాకు “ రోజు  ఈ సోది ఏంటి” అని అనుకుంటూ ఉండడం కొసమెరుపు.

 

ALSO READ: మహేష్ కత్తి పైన దాడి చేసింది ఎవరు?