ENGLISH

గ్లామ్‌షాట్‌: హాట్‌ హాట్‌ వయ్యారాల 'బంగారం'

28 December 2017-12:26 PM

ఒక్క ఛాన్స్‌ అంటూ ఇలా అందాల ఆరబోతతో ఛాన్స్‌ల కోసం ఎదురు చూస్తోంది అందాల భామ మీరా చోప్రా. పవన్‌ కళ్యాణ్‌తో 'బంగారం' సినిమాలో నటించింది. తొలి సినిమాకే పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చినా కానీ, అమ్మడికి రావాల్సిన గుర్తింపు రాలేదు. తర్వాత 'జగన్మోహిని', యంగ్‌ హీరో నితిన్‌తో 'మారో' తదితర చిత్రాల్లో నటించింది. తమిళంలో అడపా దడపా చిత్రాల్లో నటించింది. కానీ ఆక్కడ కూడా పాగా వేయలేకపోయింది ఈ బ్యూటీ. తాజాగా మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటోంది. అందుకే సోషల్‌ మీడియాలో ఇలా యాక్టివ్‌ అయ్యింది. అందాల ఆరబోతతో కట్టిపడేయ్యాలనుకుంటోంది. ఈ బ్యూటీ గ్లామర్‌ని మెచ్చి ఒక్క ఛాన్స్‌ ఇచ్చినా, చెలరేగిపోతానంటోంది. చూడాలి మరి హాట్‌ అప్పీల్‌తో ఆఫర్స్‌ దక్కించుకుంటుందో లేదో!

ALSO READ: Qlik Here Hot Photoshoot