ENGLISH

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రివ్యూ & రేటింగ్!

15 October 2021-12:23 PM

నటీనటులు: అఖిల్, పూజ హెగ్డే, ఆమని, మురళి శర్మ త‌దిత‌రులు
దర్శకుడు: బొమ్మరిల్లు భాస్కర్
నిర్మాతలు: వాసు వర్మ, బన్నీ వాసు
సంగీత దర్శకుడు: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: ప్రదీశ్ వర్మ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్


రేటింగ్: 2.75/5


అక్కినేని వారసుడిగా భారీ అంచనాలతో తెరపైకి వచ్చాడు అఖిల్. ఐతే భారీ విజయం మాత్రం ఇప్పటికీ దక్కలేదు. అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను సినిమాలు అఖిల్ కోరుకున్న విజయాలు ఇవ్వలేకపోయాయి. అటు 'బొమ్మరిల్లు' సినిమాతో క్లాసిక్ విజయాన్ని అందుకున్నాడు భాస్కర్. ఐతే తర్వాత మరో విజయం దక్కలేదు. వీరిద్దరూ ఓ మంచి విజయం కోసం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' కి జతకట్టారు. టాప్ హీరోయిన్ పూజా హెగ్డే తోడైయింది. ట్రైలర్ టీజర్ ఆసక్తిని పెంచాయి. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి విజయాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్ళాలసిందే. 


కథ:


హర్ష (అఖిల్ ) జీవితంలో చక్కగా స్థిరపడతాడు. అమెరికాలో మంచి ఉద్యోగం. పెళ్లి చూపుల కోసం ఇరవై రోజులు సెలవులపై ఇండియా వస్తాడు. విభ( పూజా హెగ్డే ) ని కలుస్తాడు హర్ష. విభ వృత్తి రీత్యా స్టాండ్ అప్ కమెడియన్. అల్ట్రా మోడ్రన్ అమ్మాయి. లైఫ్ పార్ట్నర్ పట్ల ఆమెకు కొన్ని అంచనాలు, అభిప్రాయలు ఉంటాయి. హర్షకి మాత్రం తన పెళ్లి, లైఫ్ పార్ట్నర్ పట్ల పాతతరం సాంప్రాదాయ భావాలు ఉంటాయి. విభని హర్ష కుటుంబం రిజెక్ట్ చేస్తుంది. ఐతే హర్ష మాత్రం విభ ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగింది ? పరస్పర విరుద్ధ భావాలు వున్నహర్ష , విభల ప్రయాణం ఎలా సాగింది ? వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేది వెండితెరపై చూడాలి. 


విశ్లేషణ:


కొంత మంది దర్శకులకు తాము నమ్ముకున్న లైన్ పై చాలా నమ్మకం ఉంటుంది. ఆ లైన్ పట్టుకొని సినిమా తీస్తారు. ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తారు. కానీ ఆ లైన్ లో ఇంకా ఏదో వుంది .. ఆ లైన్ తోనే ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవాలనే తాపత్రయం ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ లోనూ ఇదే వరస కనిపించింది. ఇలాంటి లైన్ పట్టుకొని రామ్ చరణ్ తో 'ఆరెంజ్' సినిమా తీశారు భాస్కర్. ప్రేక్షకులు దారుణంగా తిరస్కరించారు. ఐతే ఆరెంజ్ సినిమా లైన్ పై ఇంకా ఎదో నమ్మకం పెట్టుకున్నాడు. అదే లైన్ ని అటు ఇటు చేసి మళ్ళీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వదిలారు.


కొత్త ఐడియా వస్తేనే సరిపోదు. దాన్ని రెండున్న గంటల సినిమాగా మలిచే నేర్పు ఉండాలి. బేసిగ్గా ఆ ఐడియా సినిమాగా పని చేస్తుందా లేదో తెలుసుకునే జడ్జ్మెంట్ ఉండాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఐడియా బావుంది. ఐతే అది రెండున్నర గంటల సినిమాకి వచ్చేసరికి విషయం సరిపోలేదు. హర్ష ఇండియా కి రావడం. పెళ్లి చూపుల్లో ఫన్, విభ పాత్ర దాని చుట్టూ వున్న నేపధ్యం ..ఇవన్నీ సాఫీగానే సాగిపోతాయి. విరామం వరకూ వినోదం ఓకే అనిపిస్తుంది. ఐతే ఎక్కడైతే కథ మొదలౌతుందో అక్కడే ఇబ్బంది వచ్చి పడుతుంది. కథలో ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండదు. పైగా సెకెండ్ హాఫ్ అంతా ప్రేక్షకుడి ఊహకు అందిపోతుంది.


మొదటి సగంలో పెళ్లి చూపులు ఎపిసోడ్స్ తో వినోదం పంచిన దర్శకుడు రెండో సగానికి వచ్చేసరికి వినోదం రాబట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. వినోదం పంచడానికి చేసిన ప్రయత్నాలు సాగదీతగా అనిపిస్తాయి. రొమాంటిక్ కామెడీల విజయ రహస్యం కేవలం రొమాన్స్ కామెడీనే కాదు. ఒక జంట కచ్చితంగా కలుసుకోవాలనే ఫీలింగ్ తెరపైకి వారి కథని చూస్తున్న ప్రేక్షకుడిలో కలవాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అదే కొరవడింది. విభ, హర్ష పాత్రలతో ప్రేక్షకుడికి ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. ఎదో తెరపై ఎదో జరుగుతుందంతే అనే ఫీలింగ్ సినిమా చూడ్డం ప్రేక్షకుడి వంతు అవుతుంది. 


నటీనటులు:


అఖిల్ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. నటనలో కూడా కొంచెం పరిణితి సాధించాడు. ఐతే ఎమోషనల్ సీన్స్ చేయడం లో కొంచెం మెరుగుపడాలి. అఖిల్ డాన్స్ బావుంటుంది. ఈ సినిమాలో కూడా కొన్ని మూమెంట్స్ సూపర్ గా చేశాడు. పూజా హెగ్డే సినిమాకి గ్లామర్ జోడించింది. ఆమె లుక్స్ బావున్నాయి. విభ పాత్రకు న్యాయం చేసింది. మురళి శర్మ రొటీన్ ఫాదర్ గా కనిపించాడు. ప్రగతి, వెన్నల కిషోర్, 
పోసాని.. పరిధి మేర నటించారు. 


సాంకేతిక వర్గం:


టెక్నీకల్ గా సినిమా ఉన్నతంగా వుంది. మంచి కెమరా పనితనం కనిపించింది. రిచ్ విజువల్స్ రిచ్ గా వున్నాయి. గోపి సుందర్ మ్యూజిక్ బావుంది. రెండు పాటలు విజువల్ గా కూడా బావున్నాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఇంకా కొంచెం షార్ప్ గా వుండాల్సింది. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. 


ప్లస్ పాయింట్స్:


అఖిల్, పూజా హెగ్డే నటన 
ఫస్ట్ హాఫ్ లో వినోదం 
రెండు పాటలు 


మైనస్ పాయింట్స్:


కథ, కథనం
సెంకండ్ హాఫ్ 
ఎమోషన్ మిస్ ఇవ్వడం 


ఫైనల్ వర్దిక్ట్: 'యావరేజ్' బ్యాచిలర్

ALSO READ: 'మహా సముద్రం' మూవీ రివ్యూ & రేటింగ్!