ENGLISH

మెగా 'అల్లరి పిల్ల' వచ్చేస్తోంది గానీ

02 February 2018-11:08 AM

మెగా డాటర్‌ నిహారిక తెలుగులో తొలి సినిమా 'ఒక మనసు'తో ఆకట్టుకోలేకపోయింది కానీ, తమిళంలో మాత్రం ఎట్రాక్ట్‌ చేసేలానే ఉంది. తమిళంలో నిహారిక నటిస్తున్న చిత్రం 'ఒరునళ్లనాల్‌ పట్టు సోలరిన్‌'. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది ఈ సినిమా. 

ఈ సినిమా ప్రోమోస్‌ తెలుగు ఆడియన్స్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. తమిళంలో తొలి సినిమా ఇది నిహారికకు. ఈ సినిమా ప్రోమోస్‌లో నిహారిక చాలా డిఫరెంట్‌గా కనిపిస్తూనే, అల్లరి పిల్లలా కనిపిస్తోంది. అందుకే ఆమెకు సోషల్‌ మీడియాలో విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. తమిళంలో తొలి సినిమా అయిన ఈ తాజా చిత్రం మంచి విజయం సాధించాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైతే బావుండని అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

కానీ ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడం లేదనీ నిహారిక చెప్పింది. అయితే నిహారిక కోసం మెగా ఫ్యాన్స్‌ ఈ తమిళ చిత్రాన్ని కూడా వీక్షించే అవకాశాలు లేకపోలేవు. ఇదో డిఫరెంట్‌ మూవీ. చాలా ఫన్‌గా ఉండబోతోందట నిహారిక క్యారెక్టర్‌ ఈ సినిమాలో. పోస్టర్స్‌లో నిహారికను చూస్తుంటేనే అర్ధమవుతోంది ఆ విషయం. తెలుగులో సీరియస్‌ మూవీతో ఎంట్రీ ఇచ్చినా, నిహారిక తమిళంలో మాత్రం జోష్‌ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో నిహారికకు తెలుగులో డైలాగ్స్‌ ఉండడం విచిత్రంగా అనిపిస్తోంది. 

ఇకపోతే తెలుగులోనూ నిహారిక తన తదుపరి చిత్రాలకై కథలు వింటోందట. ఈ సారి తెలుగులో కూడా నిహారిక ఎంటర్‌టైనింగ్‌ సబ్జెక్ట్‌తోనే వస్తానంటోంది. త్వరలోనే తన తెలుగు సినిమా వివరాలు చెబుతుందట మన మెగా డాటర్‌ నిహారిక.

ALSO READ: ఛ‌లో మూవీ రివ్యూ & రేటింగ్స్