ENGLISH

నిన్ను కోరి మూవీ రివ్యూ & రేటింగ్స్

07 July 2017-15:05 PM

తారాగణం: నాని, నివేథా థామస్, ఆది పినిసెట్టి
కథ: దర్సకత్వం: శివ నిర్వాన
కథనం: కోన వెంకట్
కెమెరా: కార్తిక్ ఘట్టమనేని
సంగీతం: గోపి సుందర్
నిర్మాత: డి.వి.వీ, దానయ్య

యావరేజ్ యూజర్ రేటింగ్: 3.25/5 

కథ:

ఉమా (నాని) విశాఖపట్నం లో ఒక పి.హెచ్.డి స్టూడెంట్. పల్లవి (నివేతా థామస్) తో ప్రేమలో ఉంటాడు. ఇద్దరూ చాలా మెచ్యుర్డ్ గా అలోచించి ఇద్దరూ లైఫ్ లో సెటిల్ అయ్యాక, మంచి ఉద్యోగం సంపాదించాక మాత్రమే పెళ్ళి చేస్కోవాలి అని నిశ్చయించుకుంటారు. అదే సమయం లో కెరీర్ విషయమై ఉమా ఢిల్లీ వెళ్తాడు. పల్లవి తండ్రి (మురళి శర్మ) పల్లవి వివాహాన్ని అరుణ్ (ఆది పినిసెట్టి) తో నిశ్చయిస్తాడు. చేసేది లేక పల్లవి మనసు చంపుకొని పెళ్లికి ఒప్పుకొని ఆదిని వివాహమాడి అమెరికా వెళ్ళిపోతుంది. చాలా రోజులకి ఉమా కూడా అమెరికా లో ఉద్యోగం చేస్తూ కనిపిస్తాడు. అక్కడ పల్లవి సంతోషంగా లేదని గుర్తిస్తాడు కాని పల్లవి మాత్రం ఉమా ని లైఫ్ లో మూవ్ అవ్వమని సలహా ఇస్తూ ఉంటుంది. ఆ సమయం లో అరుణ్, పల్లవి ఉమా ని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ

నటీనటుల ప్రతిభ:

ఒక్కో సినిమా తో నాని తన ప్రతిభ ను మెరుగు పరుచుకుంటూ ముందుకేల్తున్నాడు. ప్రస్తుతం ఉన్న వాళ్ళ అందరిలో నాని ఒక మంచి నటుడు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం ద్వారా అది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. చక్కటి పాత్ర లో చాలా చక్కగా ఒదిగిపోయాడు నాని. ప్రేమ లో ఉన్న ఆనందాన్ని, బాధ ని సరి సమానంగా చూపించే ప్రయత్నం చేసాడు. 

మరో పక్క హీరోయిన్ గా చేసిన నివేతా థామస్ కూడా అందగా అభినయించింది. కళ్ళ తోనే చాలా వరకు భావోద్వేగాలను పలికించింది. నాని తో సమానం గా నటించి మెప్పు పొందే ప్రయత్నం చేసింది నివేతా.  

సపోర్టింగ్ రోల్ చేసిన ఆది పినిసెట్టి కూడా తన వంతు సహాయం, కృషి చేసి చక్కటి నటన తో ఆకట్టుకున్నాడు. ఇతర నటులు మురళి శర్మ, పృథ్వి కూడా తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

విశ్లేషణ:

చాలా చక్కటి కథను ఎంచుకున్నాడు నూతన దర్శకుడు శివ. అయినప్పటికీ అది అందరికి సుపరిచితమైన కథాంశం కావడం తో కాస్త ఫ్లో అటు ఇటు అయినప్పటికీ అలరించిమ్పజేసారు దర్శకులు. కోన వెంకట్ తన స్క్రీన్ప్లే నైపుణ్యం తో చిత్రాన్ని వేగంగా కదిలేలా చేసాడు. చిత్రం లో చాలా ఎమోషన్స్, సంభాషణలు నాచ్యురాల్ గా ఉంటాయి. అందరూ ఆస్వాదించే లా తీర్చిదిద్దారు ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు. చిత్ర పతాక సన్నివేశాల్లో కాస్త డ్రామా జోడించి ఉంటె చిత్రం ఇంకా బాగుండేది. మొదటి భాగం కాస్త స్లో గ ఉన్నప్పటికీ రెండో భాగాన్ని వేగవంతంగా తీర్చిదిద్దారు దర్శకులు. నాని పాత్ర అందరూ కనెక్ట్ ఆయె లా రాయడం ప్రధానాంశం. మాస్ ఆడియన్స్ విషయానికి వస్తే ఈ చిత్రం నిరాశే అని చెప్పుకోవచ్చు. కాని ప్రేమ కథలను కోరుకొనే వారు ఈ చిత్రాన్ని తప్పక ఆస్వాదిస్తారు.

చిత్ర కెమెరా మాన్ కార్తిక్ పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తన లైటింగ్ టెక్నిక్స్ తో అందరిని అలరిమ్పజేసాడు కార్తీక్. అమెరికా ని చాలా అద్భుతంగా ఈ చిత్రంలి చూపించారు. గోపి సుందర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన అంశం. నేపథ్య గానం తో కూడా ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్ళాడు గోపి. మొదటి చిత్రం తో చక్కని విజయాన్ని సొంతం చేసుకున్నాడు శివ. అన్ని భావాలని చక్కగా పలికిస్తూ హృదయానికి దగ్గరగా నిలిచిపోయే చిత్రాన్ని తీసాడు దర్శకుడు. ఈ చిత్రం ఎడిటింగ్ కూడా చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు కూడా కథ కు తగ్గట్టుగా భారిగా నే ఉండడం విశేషం.

నిన్ను కోరి చిత్రం హృదయానికి దగ్గరగా ఉండే చక్కని ప్రేమ కథాంశం. అనేకమైన అందమైన మూమెంట్స్ ని చాలా చక్కగా ఈ చిత్రం లో ప్రెసెంట్ చేసారు దర్శకులు. ఈ రోజుల్లో యువత కి నచ్చే, మరియు సరిగ్గా సరిపోయే కథ ఇది. ప్రధాన పాత్రదారులు ఇరువురు చక్కని ప్రతిభ కనపరచడం, మిగిలిన వారు కూడా అంతే అందంగా నటించడం తో ఈ చిత్రం అందరిని ఆసిమ్పజేస్తుంది. అన్ని చక్కగా కుదిరినా పతాక అంశాలు ఇంకా బాగా వస్తే బాగుండేది అనే ఫీలింగ్ మాత్రం మిగిలిపోతుంది.

ప్లస్:

+ నటీ నటుల ప్రతిభ
+ కెమెరా పనితనం
+ సంగీతం
+ సంభాషణలు

మైనస్:

- పతాక సన్నివేశాలు
- స్లో నరేషన్

చివరగా:

నిన్ను కోరి ఒక ఎమోషనల్ ప్రేమ కథాంశం. నాని, నివేతా ల నటన మరియు చక్కని టెక్నికల్ పనితనం వెరసి కుటుంబం తో కలిసి హాయిగా చూడ దగ్గ చిత్రం నిన్ను కోరి.

రివ్యూ బై రామ్

ALSO READ: నిన్నుకోరీ మూవీ ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి