ENGLISH

అందుకే మొదటి భాగం చేయలేదు: రవీనా.!

19 February 2021-15:01 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన 'కెజిఎఫ్: చాప్టర్ 1'.. దక్షిణాదిలోనే కాకుండా అటు హిందీ లో కూడా ఘన విజయం సాధించడంతో రెండవ భాగం పై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్య విడుదలైన 'కెజిఎఫ్ 2' టీజర్ కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ రికార్డులన్నీ కొల్లగొట్టింది. దీన్ని బట్టి ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పొచ్చు. ఈ సినిమా రేంజ్ పెంచడానికి పలువురు బాలీవుడ్ నటులని రెండవ భాగం లో చేర్చారు దర్శక నిర్మాతలు. వారిలో ఒకరు మెయిన్ విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ అయితే మరొకరు రామిక సేన్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్న రవీనా టాండన్.

 

అయితే మొదటి భాగంలోనే రవీనా నటించాల్సి వుంది.. కానీ ఆ పాత్ర పూర్తిగా డవలప్ చేయలేదని, క్లారిటీ లేదని 'కెజిఎఫ్ చాఫ్టర్ 1'ను తిరస్కరించిందట రవీనా. తాజాగా ఒక ప్రముఖ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పుకొచ్చింది రవీనా. అయితే అది క్లారిటీ లేకపోవడం కాదని, దర్శకుడు కావాలనే ఆ పాత్రలను పూర్తిగా రివీల్ చేయలేదని మొదటి భాగం చివరిలో తెలుస్తుంది. జులై 16న విడుదలకానున్న 'కెజిఎఫ్ 2' బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

ALSO READ: 'నాంది' మూవీ రివ్యూ & రేటింగ్!