ENGLISH

మాస్‌ 'టచ్‌' అదిరింది రాజా!

25 January 2018-14:56 PM

రవితేజ అంటేనే మాస్‌. ఇక మాస్‌ స్టిల్స్‌లో రవితేజ ఎలా ఉంటాడంటే ప్రత్యేకించి చెప్పడానికేముంది? విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రవితేజ తాజా చిత్రం 'టచ్‌ చేసి చూడు'. ఈ సినిమా స్టిల్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. మాస్‌ స్టిల్స్‌తో రవితేజ పిచ్చెక్కించేస్తున్నాడంతే. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు 'టచ్‌ చేసి చూడు' అఫీషియల్‌ ట్రైలర్‌ని విడుదల చేయనుంది చిత్ర యూనిట్‌. ఈ సందర్భంగా విడుదలైన స్టిల్‌ రవితేజ ఫ్యాన్స్‌ని ఊపేస్తోంది. తలపై ఖాకీ టోపీ, చేతిలో ఇనుప చైన్లు, కసిగా చూసే చూపులతో పాటు, నీట్‌ డ్రస్సులో కనిపిస్తున్నాడు రవితేజ. మాస్‌కి తోడు క్లాస్‌ టచ్‌ ఉన్న ఈ స్టిల్‌కి రెస్పాన్స్‌ అదరిపోతోంది. మొదట్నుంచీ ఈ సినిమా స్టిల్స్‌ డిఫరెంట్‌గా ఆకట్టుకుంటున్నాయి. స్టిల్స్‌కే ఈ రేంజ్‌లో రెస్పాన్స్‌ ఉంటే, ఇక ట్రైలర్‌ విడుదలైతే అంచనాలు ఏ స్థాయికి చేరనున్నాయో చూడాలి మరి. 

ఇంచుమించు రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రవితేజ రీ ఎంట్రీలో, వస్తూ వస్తూనే 'రాజా ది గ్రేట్‌' సినిమాతో హిట్‌ కొట్టేశాడు. ఈ ఏడాది 'టచ్‌ చేసి చూడు' సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే కొత్త కథలు వింటూ, ఆల్రెడీ కొన్నింటిని లైన్‌లో పెట్టాడనీ సమాచారమ్‌. తీసుకున్న గ్యాప్‌ని కవర్‌ చేసేందుకు మాస్‌ రాజా రవితేజ ఈ ఏడాది స్పీడు పెంచనున్నాడట. గతంలో మాదిరి ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలతో ఫ్యాన్స్‌ని మళ్లీ ఖుషీ చేయనున్నాడట. 'టచ్‌ చేసి చూడు' సినిమా కోసం ముద్దుగుమ్మ రాశీఖన్నా, మాస్‌ రాజా రవితేజతో రెండో సారి జత కడుతోంది. మరో హాట్‌ బ్యూటీ సీరత్‌ కపూర్‌ కూడా ఈ సినిమాలో నటిస్తోంది.

 

ALSO READ: 'పద్మావత్' మూవీ రివ్యూ & రేటింగ్స్