ENGLISH

'రెడ్' మూవీ రివ్యూ & రేటింగ్!

14 January 2021-12:32 PM

నటీనటులు : రామ్, అమ్రితా ఐయ్యర్, నివేత పెత్తురాజ్ తదితరులు 
దర్శకత్వం : కిశోర్ తిరుమల
నిర్మాత‌లు : స్రవంతి రవి కోశోర్
సంగీతం : మణిశర్మ 
సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి
ఎడిటర్: జునైద్ సిద్ధికి 

 

రేటింగ్: 2.5/5


ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ మసాలా హిట్ తర్వాత రామ్ ఓ రీమేక్ ని ఎంచుకున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ 'తడమ్' సినిమాని రెడ్ గా ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. రిమేక్ సినిమాల్లో ఓ సౌలభ్యం వుంది. ఆల్రెడీ హిట్ అయిన కధ కాబట్టి పెద్దగా అలోచించాల్సిన పని లేదు. ఇక్కడో అసౌకర్యం కూడా వుంది. ఒరిజినల్ ఫీల్ని క్యారీ చేయడం అంత ఈజీ కాదు.. అందులోనూ ట్విస్టులు వున్న కధని తీసుకున్నపుడు ఆ మలుపులు ముందే ప్రేక్షుకిడి తెలిసిపోయే ప్రమాదం వుంది. మరి రామ్..' రెడ్'ని ఎలా డీల్ చేశాడు? ఒరిజినల్ ఫీల్ క్యారీ అయ్యిందా ? ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులని ఎలా అలరించింది? అసలు ఈ రెడ్ కధేంటి ?


* కథ‌:


ఆదిత్య( రామ్) ఓ దొంగ. సిద్ధార్థ్( రామ్) ఒక నిర్మాణ సంస్థని నడుపుతుంటాడు. ఈ ఇద్దరి పోలికలు ఒకటే. సిద్దార్ మహిమా (మాళవిక శర్మ) తో ప్రేమలో ఉంటాడు. ఓ హత్య కేసులో వుహించని రీతిలో సిద్దార్థ్‌ ప్రధాన నిందితుడిగా పోలీసులకు పట్టుబడతాడు. ఈ కేసుని విచారించడానికి పోలీసు అధికారులుగా నివేద పెతురాజ్, సంపత్ రంగలో దిగుతారు. విచారణలో బాగంగా ఆదిత్యని కూడా అదుపులో తీసుకుంటారు. ఆదిత్య వచ్చిన తర్వాత కేసు మరీ కాంప్లీకేట్ గా మారుతుంది. కొన్ని మలుపులు వచ్చి పడతాయి. అసలు ఆ హత్య చేసింది ఎవరు? ఆ హత్యకి ఆదిత్య , సిద్ధార్థ్ లకి లింక్ ఏంటి ? దోషులు ఎవరు? అనేది వెండితెరపై చూడాలి.


* విశ్లేష‌ణ‌:


 ముందు చెప్పుకునట్లు రీమేకులతో ఓ ప్రమాదం వుంది. ఒక భాషలో హిట్ సాధించిన కధ ఈ ఇంటర్ నెట్ యుగంలో దాదాపు ప్రతి సినిమా గోయర్ ముందే తెలిసిపోతుంది. అది డ్రామా అయితే ఓకే. కానీ ట్విస్ట్ లు వున్న కధ అయితే మాత్రం ఆ ట్విస్ట్ ముందే తెలిసిపోతే ఇంక మాజా వుండదు. రెడ్ విషయంలో కూడా ఇదే జరిగింది. తడమ్ లో మేజేర్ ట్విస్ట్ అనుకున్న డబల్ యాక్షన్ ఇక్కడ ముందే తెలిసిపోయింది. పైగా ట్రైలర్ , టీజర్ లో చాలా రాంగ్ ప్రమోషన్ చేశారు. ఇది డబల్ యాక్షన్ సినిమా అని ముందే చెప్పేశారు. ఒరిజినల్ కధలో అయితే అసలు వాళ్ళు ఇద్దరా? ఒక్కరా?  అనే సస్పెన్స్ ని భలే వాడారు. కానీ రెడ్ విషయానికి వచ్చేసరికి ఇది వర్క్ అవుట్ కాలేదు.


సినిమా చాలా ఇంట్రస్టింగ్ గా మొదలౌతుంది. అయితే లవ్ ట్రాక్ దానికి అడ్డుతగులుతుంది. ఇలాంటి క్రైమ్ డ్రామాలో ప్రేమ కధ ఇమడదు. రెడ్ కి కూడా లవ్ ట్రాక్ మైనస్ గా మారింది. పోనీ ఆ లవ్ ట్రాక్ లో కొత్తదనం ఉందా అంటే లేదు దీంతో అది కాస్త బోరింగ్ ఎపిసోడ్ గా మిగులుతుంది. హేబ్బా పటేల్‌ సాంగ్ మాస్ కి నచ్చుతుంది. క్రైమ్ ఎపిసోడ్ మొదలైన తర్వాత కధ కాస్త ముందుకు జరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే మలుపులు కొన్ని ఆసక్తికరంగా వుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచగలిగింది.


ఇక సెకండ్ హాఫ్ లో ఏవో ఊహించని మలుపులు ఉంటాయని సీట్ లో కూర్చున్న ప్రేక్షకుడిని నిరుత్సహం తప్పుదు. క్రైమ్ విచారణ చాలా రొటీన్ గా సాగుతన్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తేలిపోయింది. అసలు ఈ కధకు ఆ ఎపిసోడ్ అస్సల్ మ్యాచ్ కాలేదు. కొన్ని సీన్లు ప్రేక్షకుడి ఊహకి అందిపోతుంటే ఇంకొన్ని సీన్లు లాజిక్ దూరంగా జరుగుతుంటాయి.  క్లైమాక్స్ పెద్దగా ఆకట్టుకోదు. కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ తెప్పించకపోగ.. ఒక దశలో ప్రేక్షకుడి మొహం పై విసుగు కూడా కనిపిస్తుంది.  


* న‌టీన‌టులు


రామ్  ఫుల్ ఎనర్జీ తో కనిపించాడు. డ్యుయల్ రోల్ లో చాలా ఈజ్ తో చేశాడు. ఐటెం సాంగ్ లో మాస్ డ్యాన్స్ కూడా బావుంది. అయితే కొన్ని చోట్ల ఇస్మార్ట్ శంకర్ హాంగ్ ఓవర్ లో  ఉన్నట్లే కనిపిస్తుంది. మాళవిక చూడ్డానికి బావుంది. అమృత అయ్యర్ పాత్ర బావుంది. నివేద పెతురాజ్ నిజాయితీ గల పోలీసర్ పాత్రలో ఆకట్టుకుంది. సంపత్ రాజ్, సత్య , మిగతా నటీనటులందరూ తమ పరిధిమేర చేశారు.


* సాంకేతికత‌:


సాంకేతికంగా సినిమా మంచి క్యాలిటీ తో వుంది. కెమరాపని తనం బావుంది.మణిశర్మ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు కిశోర్ తిరుమలకి డైలాగ్ రైటర్ గా కూడా మంచి మార్కులు పడతాయి. అయితే క్రైమ్ థ్రిల్లర్ లో కమర్షియల్ ని హంగులు జోడించేయాలనే దర్శకుడి తాపత్రయం వికటించింది.


ప్లస్ పాయింట్స్

రామ్ ఎనర్జీ ..
కొన్ని మలుపులు


మైన‌స్ పాయింట్స్‌

క‌థ‌నంలోమలుపులు ముందే తెలిసిపోవడం
రొటీన్ సీన్స్
కధపై ఆసక్తి పెంచని స్క్రీన్ ప్లేయ్
క్రైమ్ లో కమర్షియల్ హంగులు జోడించడం
పేలవమైన ఫ్లాష్ బ్యాక్


ఫైనల్ వ‌ర్డిక్ట్‌: ''రంగు'' పడలేదు

ALSO READ: మాస్టర్‌ మూవీ రివ్యూ & రేటింగ్!