ENGLISH

కారు ప్ర‌మాదానికి గురైన ఫృథ్వీరాజ్‌

20 October 2020-18:42 PM

న‌టుడు, వైకాపా నేత ఫృథ్వీరాజ్ కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ మేర‌కు ఆయ‌న పీఆర్ టీమ్ ఫేస్ బుక్ ద్వారా స‌మాచారం అందించింది. బంజారా హిల్స్ లోని బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రి ద‌గ్గ‌ర ఫృథ్వీరాజ్ న‌డుపుతున్న కారు ని మ‌రో కారు ఢీ కొట్టుకుంది. ఈప్ర‌మాదంలో ఫృథ్వీ రాజ్‌కారు కి బాగా డామేజీ అయ్యింది.

 

కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అయితే.. ఫృథ్వీరాజ్ కి ఏమైంది? ఆయ‌న‌కు ఎలా ఉంది? అన్న‌ది తెలియ‌లేదు. ప్ర‌మాద స‌మ‌యంలో ఫృథ్వీనే కారు న‌డుపుతున్నారా? డ్రైవ‌ర్ కూడా ఉన్నారా? అనేది తెలియాల్సివుంది. ప్ర‌స్తుతానికి బంజారా హిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ALSO READ: చిరుని సీఎమ్ చేద్దామ‌నుకున్నాడా?