ENGLISH

నాంది... 5 రోజుల వ‌సూళ్లెంత‌?

24 February 2021-14:25 PM

`హిట్` అనే మాట విని న‌రేష్ చాలా ఏళ్ల‌య్యింది. త‌న సినిమాకి డ‌బ్బులు తిరిగి రావ‌డ‌మే గ‌గ‌నం. అలాంటిది.. `నాంది`తో హిట్ అనే మాట విన్నాడు. నిర్మాత‌కు డ‌బ్బులూ తిరిగి వ‌చ్చాయి. `మంచి సినిమా చేశావ్‌` అన్న పొగ‌డ్త‌లూ ల‌భించాయి. ఇంత‌కంటే ఏం కావాలి? `నాంది` సినిమా న‌రేష్ ఆక‌ల్ని తీర్చింది. నిర్మాత‌ల‌కూ లాభాల్ని తెచ్చి పెడుతోంది. ఈ శుక్ర‌వారం విడుద‌లైన నంది... 5 రోజుల‌కు బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమాని దాదాపుగా 2.5 కోట్ల‌కు అమ్మేశారు నిర్మాత‌లు. మంగ‌ళ‌వారం నాటికి.. 3 కోట్లు అందుకుంది. అంటే... దాదాపుగా బ‌య్య‌ర్ల‌కు డ‌బ్బులు వ‌చ్చాయ‌న్న‌మాట‌.


నాంది 5 రోజుల లెక్క‌లు ఇవీ..

నైజాం రూ. 1.22 కోట్లు
సీడెడ్ రూ. 0.40 కోట్లు
ఉత్తరాంధ్ర రూ 0.27 కోట్లు
ఈస్ట్ రూ. 0.22 కోట్లు
వెస్ట్ రూ. 0.17 కోట్లు
గుంటూరు రూ. 0.24 కోట్లు
కృష్ణా రూ. 0.25 కోట్లు
నెల్లూరు రూ. 0.14 కోట్లు
ఏపీ + తెలంగాణ (మొత్తం) రూ. 2.91 కోట్లు
 
వరల్డ్ వైడ్ (మొత్తం) రూ. 3.07 కోట్లు
 

ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల్ని ఆహా కొనేసింది. శాటిలైట్ హ‌క్కులూ అమ్ముడుపోయాయి. దాదాపు 4 కోట్ల‌తో తీసిన సినిమా ఇది. ఇవ‌న్నీ క‌లుపుకుంటే.. నిర్మాత‌లు లాభాలు చ‌వి చూసిన‌ట్టే.

ALSO READ: చిరు ఇన్ని రిస్కులు తీసుకుంటున్నాడేంటి?