ENGLISH

బోయపాటి అవుట్‌: బాలయ్య కొత్త ప్లాన్‌ ఇదేనట.!

22 February 2019-11:30 AM

ఉన్నపళంగా నందమూరి బాలకృష్ణకు ఓ కమర్షియల్‌ హిట్టు కావాలి. అది కూడా వేగంగా తెరకెక్కి వేగంగా ప్రేక్షకుల ముందుకొచ్చేయాలి. బోయపాటితో పెట్టుకుంటే వ్యవహారం ఓ పట్టాన కొలిక్కి రాదు. బోయపాటి లెక్కలు ఆకాశంలో ఉంటాయ్‌. ఎంతగా దిగొచ్చినా 30 కోట్లంటాడు బోయపాటి. బాలకృష్ణ మాత్రం ఓ 15 కోట్లలో సినిమా కంప్లీట్‌ చేసేద్దామనే ఆలోచనతో ఉన్నాడట. అందుకోసం ఓ యువదర్శకుడితో సంప్రదింపులు కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 

 

ఎన్‌బీకే ఫిలిమ్స్‌ పతాకంపై ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే ప్రకటితం కాబోతోందని సమాచారమ్‌. ఓ పక్క సినిమా షూటింగ్‌, ఇంకో పక్క ఎన్నికల ప్రచారం.. ఏదీ ఒకదానితో ఒకటి క్లాష్‌ కాకుండా బాలయ్య ప్లాన్‌ చేసుకుంటున్నాడట. అనంతపురం జిల్లా ఇందుపురం నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాలకృష్ణ అటు రాజకీయం, ఇటు సినిమాలూ వెరసి బాగానే నెట్టుకొచ్చేశాడు. 

 

చిన్న చిన్న వివాదాలు తెరపైకొచ్చినా బాలయ్య జాగ్రత్తగా పని కానిచ్చేశాడు. మొత్తమ్మీద బాలయ్య ప్లానింగ్‌ పక్కాగానే ఉంటుంది. సో బాలయ్య కొత్త సినిమా ప్లాన్‌ వర్కవుట్‌ అయితే జూలై, ఆగస్ట్‌ నాటికి సినిమాని రిలీజ్‌ చేయచ్చనీ, ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా హ్యాపీగా చేసుకోవచ్చనీ బాలకృష్ణ అనుకుంటున్నాడట. బాలయ్య ప్లాన్‌ బాగానే ఉంది. కానీ ఇది నిజమేనా.?  

ALSO READ: క్రిష్‌.. నెక్ట్స్ ఏంటి??