ENGLISH

2019 రీక్యాప్‌... బెస్ట్ థ్రిల్లర్ - ఎవరు ?

30 December 2019-18:00 PM

వెండితెరపై ఓ కధ చూస్తున్నప్పుడు..ఓ ట్విస్ట్ వస్తే ప్రేక్షకుడు భలే థ్రిల్ అయిపోతాడు. అలాంటింది సీన్ కి సీన్ కి మధ్య ట్విస్టలు ఇచ్చుకుపొతే ..? ఆ సినిమాని 'ఎవరు ?' అంటారు. 'ది ఇన్విజిబుల్‌ గెస్ట్‌' అనే స్పానిష్‌ చిత్రానికి రిమేక్ ఇది. ఈ సినిమాని హిందీలో కూడా 'బద్‌లా' పేరిట రీమేక్‌ చేసారు. అయితే ఈ రెండు సినిమాల కంటే 'ఎవరు ?' ఎక్కువ థ్రిల్ ఇచ్చిందనే ఆ సినిమాలు చూసిన జనాలు అభిప్రాయ పడ్డారు.

 

బేసిగ్గా.. . ఒరిజినల్‌ని మార్చడం సాహసం. కానీ దర్శకుడు వెంకట్‌ రామ్‌జీ ఆ రిస్క్ తీసుకొని ఆద్యంతం ఆకట్టుకున్నాడు. మంచి కథలు ఎంచుకుంటూ థ్రిల్లర్ స్టార్ అనిపించుకుంటున్న అడివి శేష్‌.. ఈ సినిమాతో మరో విజయం అందుకున్నాడు. బేసిగ్గా థ్రిల్లర్ అంటే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. కానీ 'ఎవరు ?' ని మాత్రం మెజార్టీ ఆడియన్స్ చూశారు

ALSO READ: బన్నీ, మహేష్‌.. కలవబోతున్నారా?