ENGLISH

బిగ్‌బాస్‌ హుషారు పెంచాలి బాస్‌.!

17 August 2019-14:00 PM

మొదటి వారం రోజులూ ఫుల్‌ హుషారుగా సాగిన బిగ్‌బాస్‌ ఇప్పుడు డల్‌గా మారింది. ట్రాన్స్‌ జెండర్‌ తమన్నా ఎంట్రీతోనే బిగ్‌బాస్‌లో చీలికలు మొదలయ్యాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కదారి పట్టింది. ఆసక్తి మెల్లగా సన్నగిల్లింది. తమన్నా బిహేవియర్‌తో వీక్షకుల్ని విస్తుగొలిపేలా చేసింది. ఎట్టకేలకు తమన్నాని ఎలిమినేట్‌ చేసి, హౌస్‌ని ప్రక్షాళన చేశారని భావించినా, ఆ తర్వాత కూడా హౌస్‌లో ఎక్స్‌పెక్ట్‌ చేసే రీతిలో ఇష్యూస్‌ లేకపోవడంతో, మెల్ల మెల్లగా బిగ్‌బాస్‌కి ఫాలోయింగ్‌ తగ్గినట్లయ్యింది.

 

ఈ వారంలో మొత్తంగా ఏ ఒక్క ఇష్యూని హైలైట్‌ చేయడంలోనూ హౌస్‌మేట్స్‌ తనదైన శైలి ప్రదర్శించలేకపోయారు. టాస్క్‌లు కూడా నీరసంగా సాగాయి. మొదట్లో టాస్క్‌లు చేస్తున్నా, అందులోంచి బయటికొచ్చేసి మరీ, హౌస్‌మేట్స్‌ ఇష్యూస్‌ క్రియేట్‌ చేసేవారు. దాంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. కానీ, అంతకు ముందు జరిగిన ఇష్యూస్‌ కారణంగా, గత వారం నాగార్జున కాస్త ఎక్కువగానే క్లాస్‌ పీకేసరికి హౌస్‌మేట్స్‌లో భయం పట్టుకున్నట్లయ్యింది. ఎందుకొచ్చిన గొడవలే అనుకున్నారో ఏమో, ఫ్రెండ్లీగా, సాఫీగా నడిచిపోతోంది. కానీ, ఇష్యూస్‌ లేవదీసే సాహసం చేయట్లేదు ఏ ఒక్కరూ.

 

వరుణ్‌ - వితిక రొమాంటిక్‌ ట్రాక్‌ కానీ, పునర్నవి, రాహుల్‌ లవ్‌ ట్రాక్‌ కానీ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేయడం లేదు. మధ్యలో హిమజ కాస్త యాక్టివ్‌ అయినట్లు కనిపించినా మళ్లీ డల్‌ అయిపోయింది. బాబా భాస్కర్‌ కూడా ఆశించినంతగా ఎంటర్‌టైన్‌ చేయలేకపోతున్నారు. వీకెండ్‌ వచ్చేసింది. ఈ వీక్‌ నాగార్జున హౌస్‌మేట్స్‌లో ఏమైనా జోష్‌ నింపే ప్రయత్నం చేస్తాడేమో చూడాలిక.

ALSO READ: మెగాహీరో రిస్క్‌ చేస్తున్నాడా?