ENGLISH

విజయ్ ని “స్టార్” గా ప్రకటించిన మెగాస్టార్

20 August 2018-11:03 AM

పెళ్ళి చూపులు తో అందరిని ఆశ్చర్యపరిచి, అర్జున్ రెడ్డి తో షాక్ గురిచేసిన విజయ్ దేవరకొండ తాజాగా గీత గోవిందంతో అందరిని ఆనందంలో ముంచేస్తున్నాడు.

ఇక నిన్న జరిగిన గీత గోవిందం సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ- గీత గోవిందం సక్సెస్ తో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయాడు, అయితే ఈ సక్సెస్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని సక్సెస్ ని తలకి కాకుండా గుండెల్లోకి తీసుకోవాలని” మంచి సూచన ఇచ్చాడు.

తన కెరీర్ లో 30 సినిమాలు చేసాక కూడా స్టార్ స్టేటస్ రాలేదని, ఖైదీ సినిమా హిట్ అయ్యాక కాని తనని ఒక స్టార్ గా గుర్తించలేదు అని చెప్పుకొచ్చాడు మన మెగాస్టార్.

ఇక విజయ్ కి ఇచ్చిన సూచన విన్న అందరూ మెగాస్టార్ ఇచ్చిన ఈ విలువైన సూచనని పాటిస్తే కెరీర్ లో విజయ్ దేవరకొండ్ దూసుకుపోవడం ఖాయం అన్న భావన అందరిలోనూ ఉంది.

 

ALSO READ: టాక్ అఫ్ ది వీక్- గీత గోవిందం