ENGLISH

'దబాంగ్‌ 3' క్లైమాక్స్‌ ఎలా ఉండబోతోందో తెలుసా.?

12 December 2019-12:29 PM

కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన భారీ యాక్షన్‌ మూవీ 'దబాంగ్‌ 3' చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా క్లైమాక్స్‌ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్‌ బయటికి వచ్చి, అభిమానుల్లో ఆనందోత్సాహాల్లో ముంచేస్తోంది. ఇంతకీ ఏంటా విషయం అంటే, క్లైమాక్స్‌ ఫుల్‌ యాక్షన్‌తో నింపేశారట. ఈ సన్నివేశం కోసం ఏకంగా 500 మంది జూనియర్‌ ఆర్టిస్టులు, దాదాపు 100 కార్లు ఉపయోగించారట. 500 మంది శత్రువులతో సల్మాన్‌ పోరాడే సన్నివేశాలు అత్యద్భుతంగా చిత్రీకరించారట. అలాగే 100 కార్లను హీరో దగ్ధం చేసే సీన్‌ కళ్లు జిగేల్‌ మనిపిస్తుందట.

 

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభుదేవా డైరెక్షన్‌ అంటే ఫైట్సే కాదు, డాన్సులు కూడా సూపర్బ్‌ అనేలా ఉంటాయి. నో డౌట్‌. ఈద్‌ సందర్భంగా ప్రతీ సంవత్సరం సల్మాన్‌ ఖాన్‌ నుండి ఓ సినిమా వస్తుండడం సంప్రదాయంగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్రిస్మస్‌ సండర్భంగా డిశంబర్‌ 25న 'దబాంగ్‌ 3'తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేసేందుకు కండల వీరుడు రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమాలో సల్మాన్‌కి విలన్‌గా కిచా సుదీప్‌ నటిస్తున్నారు. విలన్‌గా సుదీప్‌ పర్‌ఫామెన్స్‌ ఎలా ఉంటుందో తెలుగులో 'ఈగ' సినిమాలో చూశాం. 'ఈగ'కు విలన్‌గానే అంత పవర్‌ చూపిస్తే, ఇక్కడ కండల వీరుడి ముందు సుదీప్‌ ఇంకెంత పవర్‌ చూపిస్తాడో మాటల్లో చెప్పడం కష్టమే సుమీ.

ALSO READ: 'వెంకీ మామ' హిట్‌: సర్టిఫికెట్‌ ఇచ్చిన సమంత.!