ENGLISH

స‌క్సెస్ మీట్ వెనుక సీక్రెట్ ఇదా?

26 February 2021-10:12 AM

గ‌త వారం విడుద‌లైన `నాంది` మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇది ప్ర‌స్తుత స‌మాజానికి అవ‌స‌ర‌మైన సినిమా అంటూ.. సినీ విమ‌ర్శ‌కులు కీర్తిస్తున్నారు. చిత్ర‌బృందం ఇప్ప‌టికే స‌క్సెస్ మీట్ నిర్వ‌హించేసింది. అయితే... ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో మ‌రో స‌క్సెస్ మీట్ సాగింది. ఆయ‌న చిత్ర‌బృందాన్ని ఆహ్వానించి, అభినందించారు. ఈ సినిమాకి ఆయ‌నేం నిర్మాత కాదు. క‌నీసం పంపిణీదారుడిగానూ వ్య‌వ‌హ‌రించ‌లేదు. అయినా స‌రే - దిల్ రాజు ముందుకొచ్చి, చిత్ర‌బృందాన్ని అభినందించ‌డం ఓ కొత్త ప‌రిణామంగా చిత్ర‌సీమ భావించింది.

 

అయితే ఈ స‌క్సెస్ మీట్ వెనుక సీక్రెట్ మ‌రోటి ఉంద‌ని తెలిసొచ్చింది. `నాంది` కి సంబంధించిన అన్ని భాష‌ల రీమేక్ రైట్స్‌ని, దిల్ రాజు హౌల్ సేల్ గా కొనుగోలు చేసేశార్ట‌. త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ అన్నీ ఇప్పుడు దిల్ రాజు ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఆయ‌న ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. అందుకే ప‌నిగ‌ట్టుకుని ఈ చిత్ర‌బృందాన్ని ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారని ఇండ్ర‌స్ట్రీలో గుస‌గుస‌లాడుకుంటున్నారు. రాజుగారు.. లాభం లేనిదే ఏ ప‌ని చేయ‌రు క‌దా..?

ALSO READ: టికెట్ రేటుతో 'చెక్‌' పెట్టేస్తున్నారా?