ENGLISH

మిల్కీ బ్యూటీ బెస్ట్‌ఫ్రెండ్‌ ఎవరో తెలుసా?

09 March 2018-11:45 AM


సినీ ఇండస్ట్రీలో తోటి హీరోయిన్స్‌తో స్నేహంగా ఉండడం మామూలు విషయమే. అయితే బెస్ట్‌ ఫ్రెండ్‌షిప్‌ అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ స్టార్‌ హీరోయిన్స్‌ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా, శృతిహాసన్‌లు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌ అట. మంచి ఫ్రెండ్స్‌ అంటే బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అన్నమాట. ఈ విషయాన్ని మిల్కీ బ్యూటీ తమన్నానే స్వయంగా చెప్పింది. లేకపోతే ఇంతవరకూ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు.

 

ఉమెన్స్‌ డే సందర్భంగా మిల్కీబ్యూటీ తమన్నా, శృతిహాసన్‌తో ఆప్యాయంగా కలిసి దిగిన ఫోటోని పోస్ట్‌ చేస్తూ ఈ విషయం అభిమానులతో పంచుకుంది. బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటే వారిద్దరి మధ్యా ఏ సీక్రెట్స్‌ ఉండవు. అలాగే వీరిద్దరి మధ్యా కూడా ఏ సీక్రెట్స్‌ ఉండవట. తమ తమ అనుభవాల్ని ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా ఓపెన్‌గా షేర్‌ చేసుకుంటూంటారట. ఇండస్ట్రీలో ఇంత మంచి బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరూ ఉండరట కూడా. అంతలా తమ ఫ్రెండ్‌షిప్‌ వేల్యూస్‌ని వీరిద్దరూ కాపాడుకుంటున్నారట చాలా కాలంగా అదీ సంగతి.

 

ఈ సంగతిలా ఉంచితే, ప్రస్తుతం మిల్కీ బ్యూటీ, శృతిహాసన్‌ ఇద్దరూ తక్కువగానే సినిమాల్లో కనిపిస్తున్నారు. శృతిహాసన్‌ సౌండ్‌ అయితే అస్సలు ఎక్కడా వినిపించడం లేదు. తండ్రి కమల్‌హాసన్‌తో నటిస్తున్న 'శభాష్‌ నాయుడు' ఏమైందో తెలీదు. చాలా కాలంగా ఆ సినిమా ఊసే లేదు. ఇక మిల్కీ బ్యూటీ విషయానికి వస్తే, తెలుగులో కళ్యాణ్‌రామ్‌తో 'నా నువ్వే' చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో పక్క బాలీవుడ్‌ 'క్వీన్‌' తెలుగు రీమేక్‌లోనూ ముద్దుగుమ్మ తమన్నా నటిస్తోంది. 
 

ALSO READ: కుర్రోడొస్తున్నాడు 'కిర్రాక్‌' హిట్టిస్తాడా?