ENGLISH

ఈషారెబ్బా ర‌చ్చ గెలుస్తుందా?

15 April 2021-11:00 AM

అవ‌కాశం - అదృష్టం క‌వ‌ల పిల్ల‌ల్లాంటివి. ఒక‌టుంటే, రెండోది ఉన్న‌ట్టే. అయితే ఇషా రెబ్బా విష‌యంలో ఈ ఫార్ములా రివ‌ర్స్ అయ్యింది. త‌నకు అవ‌కాశాలొచ్చినా, అదృష్టం క‌లిసి రాలేదు. చేతిలో హిట్లు లేక‌పోవ‌డంతో - ఇష్టా ప‌డిన క‌ష్టం అంతా వృథా అయ్యింది. `అర‌వింద స‌మేత‌`లాంటి సినిమాలో న‌టించినా, త‌న‌కు బ్రేక్ రాలేదు.

 

`పిట్ట క‌థ‌లు`లో త‌న శైలికి విరుద్ధంగా హాట్ హాట్ గా క‌నిపించినా లాభం లేక‌పోయింది. ఎంత చేసినా, తెలుగులో బ్రేక్ రావ‌ట్లేద‌ని బాధ ప‌డిందో, ఇక్క‌డ కాక‌క‌పోతే, మ‌రోచోట అదృష్టాన్ని వెదుక్కోవాల‌న్న స‌త్యం బోధ ప‌డిందో తెలీదు గానీ, ఇప్పుడు కేర‌ళ‌కు జంప్ అయ్యింది. అక్క‌డ ఓ మ‌ల‌యాళ సినిమాని ఒప్పుకుంది. కొంత‌కాలం తమిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించి, అక్క‌డ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని ఫిక్స‌య్యింది. ఇంట గెల‌చి, ర‌చ్చ గెల‌వ‌మ‌న్నారు. మ‌రి తెలుగులో తేలిపోయిన ఇషాకి అక్క‌డైనా స‌రైన బ్రేక్ ల‌భిస్తుందేమో చూడాలి.

ALSO READ: జాగ్ర‌త్త ప‌డిపోయిన దిల్ రాజు