ENGLISH

హారిక, అఖిల్‌.. ఏం ఓవరాక్షన్‌ బాసూ!

21 October 2020-15:00 PM

బిగ్‌హౌస్‌లో ఏం జరుగుతోంది.? ఒకర్ని మించి ఇంకొకరు ఓవరాక్షన్‌ చేసుకుంటూ పోతే, ‘రియాల్టీ షో’ అన్న ప్రస్తావనకు అర్థమేంటి.? అని బుల్లితెర వీక్షకులు విస్తుపోతున్నారు. పూర్తిగా డైరెక్షన్‌ - యాక్షన్‌ అన్నట్లుగానే జరుగుతోంది బిగ్‌ హౌస్‌లో కంటెస్టెంట్స్‌ ప్రయాణం. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్‌లో ఇటు అలేఖ్య హారిక, అటు అఖిల్‌ సార్థక్‌.. ఇద్దరూ ఓవరాక్షన్‌తో వీక్షకులకు చిరాకు తెప్పించేశారని మెజార్టీ బిగ్‌బాస్‌ ఫాలోవర్స్‌ అభిప్రాయపడుతున్నారు. టాస్క్‌లో హారిక, రాక్షసుల నుంచి మనుషుల్లోకి మారాల్సి వచ్చింది. కానీ, అది తనకు ఇష్టం లేదంటూ ఏకంగా ఏడ్చేసింది ఓ కెమెరాముంది.

 

ఓ సినిమాలో బ్రహ్మానందంతో రియాల్టీ షో ‘స్పూఫ్‌’ చేయించారు అప్పట్లో.. అది బాగా పేలింది. దాన్ని ఫాలో అయినట్టుంది హారిక నటన. ఇంకోపక్క అఖిల్‌, రాక్షసుల బృందంలో వున్నాడుగానీ, తనకు అలా బిహేవ్‌ చేయడం నచ్చలేదన్నాడు. నటుడే కదా, నచ్చకపోవడమేంటి.? అని అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. చివరికి మనుషుల బృందంలోకి అఖిల్‌ వచ్చేశాడనుకోండి.. అది వేరే సంగతి. కంటెస్టెంట్స్‌ క్రమక్రమంగా బిగ్‌బాస్‌కి భారమైపోతున్నారనే విషయం నిర్వాహకులకు అర్థమవుతోందో లేదోగానీ వీక్షకులు మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించారు. హౌస్‌లో వుండడానికి ఏమాత్రం అర్హత లేని వ్యక్తులు సేవ్‌ అవుతున్నారంటూ వీక్షకులు వాపోతున్నారు.

ALSO READ: ఎఫ్ 2కి అరుదైన గౌర‌వం