ENGLISH

‘ఆచార్య’ రేంజ్‌ ఆ రేంజ్‌లో వుంటుందా?

23 November 2020-09:30 AM

కరోనా కష్టాల్ని దాటుకుని సినీ పరిశ్రమ ముందడుగు వేయడానికి సమాయత్తమవుతోంది. కొన్ని సినిమాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి.. కొన్ని నిర్మాణంలో బిజీగా వున్నాయి. ఇంకొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి కూడా. టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా చెప్పుకోబడుతున్న ‘ఆచార్య’ షూటింగ్‌ కూడా పునఃప్రారంభమయ్యింది. మెగాస్టార్‌ చిరంజీవి ఇంకా సెట్‌లో అడుగు పెట్టాల్సి వుంది. కాగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆన్‌ లొకేషన్‌ స్టిల్స్‌ బయటకు వచ్చాయి. చిత్ర యూనిట్‌, సోనూ సూద్‌ని సన్మానిస్తున్న సమయంలో తీసిన ఫొటోలవి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ అద్భుతమైన టెంపుల్‌ కన్పిస్తోంది. సినిమా కథాంవం కూడా దేవాలయాలకు సంబంధించినదే కావడం గమనార్హం.

 

సెట్టింగ్‌ విషయంలో భారీతనం కనిపిస్తోంది. ఇక, బడ్జెట్‌ పరంగా చూసకున్నా.. ఈ సినిమాకి బీభత్సంగానే ఖర్చు చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సి ఆచార్య, సమ్మర్‌కి షిఫ్టయిపోయినట్లే. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సినిమాకి ముందు అనుకున్న భారీతనం కంటే, మరింత భారీగా వుండేలా సరికొత్త సొబగులు అద్దుతున్నారట. ‘సైరా’ స్థాయిలోనే ‘ఆచార్య’ కూడా వుండబోతోందని సమాచారం. అన్నట్టు, ఈ సినిమాతో మెగాస్టార్‌ చిరంజీవి పొలిటికల్‌ సెటైర్లు కూడా వేయబోతున్నారన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం.

ALSO READ: ముందైనా వెనకైనా.. శృంగారం తప్పు కాదట!