ENGLISH

మా ఇద్దరి మధ్యలో ఏమిలేదు: కాజల్

13 August 2017-13:08 PM

నేనే రాజు నేనే మంత్రి చిత్రం విజయవంతం కావడంలో రానా ఎంత కీలకమో కాజల్ అగర్వాల్ పాత్ర కూడా అంతే అనేది నిర్వివాదాంశం.

ఇక భార్యాభర్తలుగా వీరిరువురి నటన ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణ అని కచ్చితంగా చెప్పొచ్చు. వీరి మధ్య వచ్చే సన్నివేశాల్లో వీరు కనబరిచిన అభినయానికి ఈ ఇద్దరి మధ్యలో ఏదో ఉందంటూ పుకార్లు మొదలయ్యాయి.

అయితే ఇవి కేవలం పుకార్లే అని తమ మధ్య స్నేహం తప్పించి మరేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ పుకార్ల పై రానా ఇంకా స్పందించాల్సి ఉంది.

కాకపోతే ఇప్పటికే రానకి పలువురు హీరోయిన్స్ తో చాలా లింకప్స్ లో ఆయన పేరు వచ్చింది. కాని వాటిల్లో ఏ ఒక్కటి నిజం లేదు అని తేలిపోయింది.

 

ALSO READ: యంగ్ హీరోకి తల్లిగా మీనా?