ENGLISH

'కాజల్‌ - కిచ్లు' ప్రేమకథ.. ఇదో సరికొత్త రికార్డ్‌.!

24 November 2020-19:00 PM

అసలు కాజల్‌ అగర్వాల్‌, గౌతం కిచ్లు ఎలా ప్రేమలో పడ్డారు.? అన్న విషయమై సినీ మీడియా బీభత్సంగా ఆరాలు తీసేస్తోంది. 'మాదేమీ అంత పెద్ద డ్రమెటిక్‌ లవ్‌ స్టోరీ కానే కాదు..' అని కాజల్‌ సింపుల్‌గా చెప్పేస్తున్నా, తెరవెనుక చాలా పెద్ద కథే నడిచిందంటూ అటు బాలీవుడ్‌ మీడియా, ఇటు సౌత్‌ సినీ మీడియా.. ఓ రేంజ్‌లో కథనాల్ని వండి వడ్డించేస్తున్నాయి. అయితే, కాజల్‌ మాత్రం కూల్‌గా చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతోంది. 'మీడియాలో చర్చ జరుగుతున్నట్లుగా, మా మధ్య ఆ స్థాయిలో రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ అనేదే జరగలేదు..' అని ఇంకోసారి కాజల్‌ అగర్వాల్‌ కుండబద్దలుగొట్టేసింది.

 

హనీమూన్‌ విషయంలో ఇంత ప్రచారం అవసరమా.? అంటే, 'నా అభిమానులు నా నుంచి చాలా ఆశిస్తారు.. వారి ప్రేమకి నేనెప్పుడూ బానిసనే.. వారి ఆనందం కోసం.. నాకు సంబంధించిన విషయాల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాను..' అని చెప్పింది కాజల్‌. ఇదిలా వుంటే, కాజల్‌కి సంబంధించి ఇంతలా చర్చ జరుగుతుండడం ఓ రికార్డ్‌.. అంటున్నారు ఆమె అభిమానులు. కాజల్‌ కిచ్లు అనే హ్యాష్‌ ట్యాగ్‌ని సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో వుంచేందుకు ఆమె అభిమానులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.

 

'పెళ్ళయ్యాక కూడా నా మీద అదే ప్రేమ చూపిస్తున్నారు.. వారిని అలరించేందుకు వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో ఇకపై నటిస్తాను..' అంటోంది కాజల్‌ అగర్వాల్‌. త్వరలో 'ఆచార్య' సెట్‌లో కాజల్‌ అడుగు పెట్టనున్న విషయం విదితమే.

ALSO READ: Kajal Agarwal Latest Photoshoot