ENGLISH

'ఇండియన్‌' కోసం చందమామ చాలా కష్టపడుతోంది.!

17 December 2018-16:05 PM

గ్లామర్‌ తారగా వెలుగొందిన చందమామ కెరీర్‌లో చాలా చాలా సక్సెస్‌లు అందుకుంది. అయితే వాటన్నింట్లోకీ తాజాగా అంది పుచ్చుకున్న ఆఫర్‌ 'ఇండియన్‌ 2' ప్రత్యేకమైనది. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ పక్కన అందంగా మెరిసిపోవాలని చాలా మంది ముద్దుగుమ్మలు ఉవ్విళ్లూరుతారు. కానీ అంత సులువుగా ఆ అవకాశం అందర్నీ వరించదు. ఇన్నాళ్ల తర్వాత ఆ అరుదైన అవకాశం చందమామ కాజల్‌ అగర్వాల్ని వరించింది.

 

1996లో శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా వచ్చిన 'ఇండియన్‌' చిత్రానికి ఇన్నాళ్ల తర్వాత సీక్వెల్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్‌కి జోడీగా కాజల్‌ని ఎంపికైన సంగతి కూడా తెలిసిందే. జనవరి నుండి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈలోగా కథను బట్టి హీరోయిన్‌ వర్మ కళలో ప్రావీణ్యం పొందాల్సి ఉందట. సో కాజల్‌ ఆ కళను కష్టపడి నేర్చుకుంటోంది. దీన్ని బట్టి ఈ సినిమాలో కాజల్‌ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాదు, ఎంతో కొంత ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రే అని అర్ధం చేసుకోవచ్చు.

 

ఇకపోతే ఈ సినిమాలో కమల్‌హాసన్‌ డబుల్‌ రోల్‌ పోషించనున్నారు. తండ్రీ కొడుకుల పాత్రలవి. తండ్రి పాత్ర అయిన 'సేనాపతి' సినిమాకి అత్యంత కీలకం. ఈ పాత్ర తీరు తెన్నుల్ని, పవర్‌నీ ఆల్రెడీ మొదటి పార్ట్‌లో చూసేశాం. అంతకుమించిన పవర్‌తో ఈ సీక్వెల్‌లో ఆ పాత్ర ఉండబోతోందట. ఈ పాత్రకు జోడీగా ఇండియన్‌లో సీనియర్‌ నటి సుకన్య నటించగా, 'ఇండియన్‌ 2' కోసం ఎవర్ని ఎంచుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.

 

ALSO READ: తాజా.. తాజా.. 'సాహో' సర్‌ప్రైజ్‌ ఇదిగో.!