ENGLISH

దిల్ రాజు పెంచేసిన `కేజీఎఫ్` రేటు!

27 January 2021-17:03 PM

దేశ వ్యాప్తంగా.. అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న సినిమాల్లో `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ఒటి. కేజీఎఫ్ విడుద‌ల అవుతున్న‌ప్పుడు ఆ సినిమాపై ఎవ్వ‌రికీ ఎలాంటి న‌మ్మ‌కాలూ లేవు. అందుకే 5 కోట్ల‌కు కొన‌డానికి కూడా ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ సినిమా రేటు 50 కోట్లు ప‌లుకుతోంది. కేజీఎఫ్ ని కొన్న సాయి కొర్ర‌పాటినే ఈసినిమానీ 50 కోట్ల‌కు కొనేద్దాం అనుకుంటున్న‌ప్పుడు దిల్ రాజు రంగంలోకి దిగి.. ఏకంగా 70 కోట్లు కోట్ చేసిన‌ట్టు టాక్‌. దిల్ రాజు లాంటి నిర్మాత‌... పైగా 20 కోట్లు ఎక్కువ ప‌లుకుతోంది.. అలాంట‌ప్పుడు కేజీఎఫ్ నిర్మాత‌లు మాత్రం వ‌దులుతారా? ఈ సినిమాని దిల్ రాజుకే క‌ట్ట‌బెట్ట‌డానికి రెడీ అయ్యారు.

 

నిజానికి 50 కోట్ల సినిమాని 70 కోట్ల‌కు కొన‌డ‌మే పెద్ద రిస్క్‌. పైగా అది డ‌బ్బింగ్ సినిమా. కాక‌పోతే ఈసినిమాపై దిల్ రాజుకి గ‌ట్టి న‌మ్మ‌కం కుదిరింది. ఇన్ సైడ్ వ‌ర్గాల నుంచి టాక్ తెప్పించుకుని, సినిమా ఎలా వ‌చ్చింది? ఏ రేంజ్ లో ఆడ‌బోతోంది? అనే విష‌యాన్ని బేరీజు వేసుకుని ఫ్యాన్సీ రేటుకి ఈ సినిమాని కొనేశాడ‌ని స‌మాచారం. పంపిణీదారుడిగా దిల్ రాజు అంచ‌నాలు ఎప్పుడూ త‌ప్ప‌లేదు. మ‌రి ఈ సారి ఏంజ‌రుగుతుందో చూడాలి.

ALSO READ: ప‌వ‌న్‌తో పూరి `జ‌న‌గ‌న‌మ‌ణ‌`?