ENGLISH

బ‌న్నీ త‌ర‌వాత చ‌ర‌ణ్‌తోనే?

21 October 2020-14:00 PM

ఓ సినిమా చేతిలో ఉండ‌గానే, మ‌రో రెండు మూడు సినిమాలు పైప్ లైన్‌లో ఉంచుకోవ‌డం ఈనాటి హీరోల‌కు అల‌వాటుగా మారింది. అది మంచి ప‌ద్ధ‌తి కూడా. కొన్ని క‌థ‌లు ప‌క్క‌న పెట్టుకోవ‌డం మంచిది. ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆయా ప్రాజెక్టుల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా అదే చేస్తున్నాడు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`తో బిజీగా ఉన్నాడు చ‌ర‌ణ్. ఆ త‌ర‌వాత‌.. చ‌ర‌ణ్ సినిమా ఎవ‌రితో అనేది ఫైన‌ల్ కాక‌పోయినా, కొన్ని క‌థ‌లు విని `ఓకే` చేసేస్తున్నాడు. తాజాగా కొర‌టాల శివ క‌థ‌కీ చ‌ర‌ణ్ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

 

కొర‌టాల‌తో చ‌ర‌ణ్ ఎప్పుడో సినిమా చేయాల్సింది. ఓసారి ముహూర్తం జ‌రుపుకుని కూడా ఆగిపోయింది. రంగ‌స్థ‌లం త‌ర‌వాత‌.. కొర‌టాల‌తోనే సినిమా అనుకున్నారు. కానీ కుద‌ర్లేదు. ఇప్పుడు చ‌ర‌ణ్ తో సినిమా ఓకే చేయించుకున్నాడు కొర‌టాల‌. ప్ర‌స్తుతం `ఆచార్య‌` ప‌నుల్లో ఉన్నాడు కొర‌టాల‌. ఆ త‌ర‌వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలి. బ‌న్నీ తో అయ్యాక‌.. కొర‌టాల సినిమా చ‌ర‌ణ్‌తోనే అన్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

ALSO READ: సంక్రాంతి బ‌రిలో... రానా సినిమా