ENGLISH

హీరో హిట్టు.. హీరోయిన్ మాత్రం ఫట్టు.!

27 January 2021-10:18 AM

‘క్రాక్’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి విడుదలైన మిగతా అన్ని సినిమాలు తేలిపోవడం ‘క్రాక్’కి బాగా కలిసొచ్చింది. హీరో రవితేజ, ఈ యేడాది సంక్రాంతి హీరో అయ్యాడు. మరి, హీరోయిన్ సంగతేంటి.? శృతిహాసన్‌కి ఇది రీ-ఎంట్రీ సినిమా. దాంతో, సినిమాపై చాలా ఆశలే పెట్టకుంది. ఆమె ఆశించినట్లే సినిమా విజయవంతమయ్యింది కూడా. కానీ, ఏం లాభం.? శృతిహాసన్ పేరు మాత్రం ఎక్కడా వినిపించడంలేదు.

 

సినిమా ప్రమోషన్లలో కాస్త గట్టిగా ఆమె కనిపించి వుంటే, పరిస్థితి ఇంకోలా వుండేది. ‘కొన్నిప్రత్యేక కారణాల వల్ల సినిమా ప్రమోషన్లలో కనిపించలేకపోయాను. కానీ, సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను..’ అని శృతిహాసన్ చెబుతోందిగానీ, ఆమె ఆబ్జెన్స్.. ఆమెకు ఎంత మైనస్ అయిపోయిందో అందరికీ అర్థమవుతూనే వుంది. ఇక, శృతి చేతిలో ‘వకీల్ సాబ్’ సినిమా వుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న సినిమా ఇది.

 

అయితే, ఇందులో శృతిహాసన్ పాత్ర నిడివి చాలా చాలా తక్కువే. చివరి నిమిషంలో ఆమె పాత్రకి కత్తెర వేటు ఎక్కువగానే పడినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ‘క్రాక్’ విషయానికొస్తే, హీరో హిట్టు.. హీరోయిన్ మాత్రం ఫట్టు.. అనే చర్చ సినీ పరిశ్రమలో జోరుగా సాగుతోంది. అందుకేనేమో, శృతి ఇంకాస్త యాక్టివ్ అవుతోంది సోషల్ మీడియాలో. అయినాగానీ, భలే ఛాన్స్ అయితే ఆమె మిస్ చేసుకుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి మరి.

ALSO READ: పవన్ రెండు పడవల ప్రయాణం.. ఎందాకా.?