ENGLISH

చిరు ఇన్ని రిస్కులు తీసుకుంటున్నాడేంటి?

24 February 2021-12:00 PM

చిరంజీవి.. అప్ప‌టికీ ఇప్ప‌టికీ మెగాస్టారే. త‌న స్టామినా ఏమిటో ఖైది నెం 150 చెప్పేసింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం త‌ర‌వాత సినిమా చేసినా.. రికార్డు వ‌సూళ్లు క‌ట్ట‌బెట్టారు అభిమానులు. అంత‌కంటే ఏం కావాలి? చిరు కోరుకుంటే... టాప్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు తీయ‌గ‌ల‌డు. డైరెక్ట‌ర్లంతా రెడీగా ఉంటారు కూడా. కానీ.. చిరు ఏరి కోరి ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌ని ఎన్నుకోవ‌డం క‌ల‌వ‌ర పెడుతోంది. మెహ‌ర్ ర‌మేష్ తో చిరు ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

 

`వేదాళం`కి రీమేక్ అది. మెహ‌ర్ ట్రాక్ రికార్డ్ అంద‌రికీ తెలిసిందే. త‌నతో సినిమా అంటే చిరు ఫ్యాన్స్ ఝ‌డుసుకున్నారు. మెహ‌ర్ తో సినిమా ఏంటి? అని ఆశ్చర్య‌పోయారు. కానీ మెహ‌ర్ పై న‌మ్మ‌కం ఉంచాడు చిరు. ఆమ‌ధ్య చిరంజీవి శ్రీ‌నువైట్ల‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అదీ షాకింగ్ న్యూసే. ఎందుకంటే దూకుడు త‌ర‌వాత త‌న‌కు స‌రైన హిట్టు లేదు. ఆ సంగ‌తి అటుంచితే.. ఇప్పుడు కృష్ణ‌వంశీతో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడ‌ట చిరు. కృష్ణ‌వంశీ బాల‌య్య కోసం ఓ క‌థ రెడీ చేసుకున్నాడు.

 

ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు అదే క‌థ‌తో చిరు సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. ఇదే నిజమైతే... చిరు ఫ్యాన్స్‌కి అంత‌కంటే షాకింగ్ న్యూస్ ఇంకోటి ఉండ‌దు. ఎందుకంటే వ‌రుస‌గా తాను ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌ని ఎంచుకుంటున్నాడు. ఇది ఎంతో రిస్క్ కూడా. చిరుకి ద‌ర్శ‌కులు, క‌థ‌లు దొర‌క‌డం లేదా? పెద్ద ద‌ర్శ‌కులెవ‌రూ చిరుతో సినిమా చేయ‌డానికి రెడీగా లేరా? చిరు ఎందుకింత తొంద‌ర ప‌డుతున్న‌ట్టు? అనే ప్రశ్న‌లు రేకెత్తుతున్నాయి.

ALSO READ: త‌మ‌న్‌... మ‌ళ్లీ దొరికేశాడు