ENGLISH

60 రూపాయ‌ల 18 పైస‌ల‌కే 'న‌ర్త‌న‌శాల‌'

21 October 2020-13:00 PM

నంద‌మూరి బాల‌కృష్ణ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన చిత్రం `న‌ర్త‌న‌శాల‌`. బాల‌య్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. కొంత‌మేర షూటింగ్ జ‌రిపాక‌.. ఆగిపోయింది. మ‌ళ్లీ ఆ ప్రాజెక్టు జోలికి వెళ్ల‌లేదు. అయితే.. షూట్ చేసిన కొంత భాగాన్ని ఎడిట్ చేసి, ఇప్పుడు విడుద‌ల చేస్తున్నారు. శ్రేయాస్ ఓటీటీ ద్వారా. 17 నిమిషాల నిడివిగ‌ల ఈ సినిమాలోని స‌న్నివేశాల్ని ఈనెల 24 నుంచి శ్రియాస్ ఓటీటీలో చూడొచ్చు. అయితే.. టికెట్ కొనాల్సిందే.

 

ఈ సినిమా టికెట్ ధ‌ర 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. అయితే టాక్సులు ఆద‌నం. జీఎస్‌టీ 9 రూపాయ‌లు, అద‌నపు ఛార్జీలు 1.18 రూపాయ‌లు చెల్లించాలి. అంటే మొత్తానికి 60 రూపాయ‌ల 18 పైస‌లు అవుతోంది. బుధ‌వారం నుంచి బుకింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. సౌంద‌ర్య‌, శ్రీ‌హ‌రి లాంటి దివంగ‌త న‌టీన‌టుల చివ‌రి చిత్ర‌మిది. వాళ్ల‌ని చివ‌రి సారి చూడ్డానికైనా టికెట్లు బాగానే తెగుతాయ‌ని భావిస్తున్నారు. క‌నీసం 2 ల‌క్ష‌ల టికెట్లు తెగినా.... గిట్టుబాటు అయిన‌ట్టే.

ALSO READ: సంక్రాంతి బ‌రిలో... రానా సినిమా