ENGLISH

పవర్‌ స్టార్‌ ఫాలో అయితే అలాగే ఉంటుంది మరి.!

04 April 2020-13:30 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి మామూలుగానే బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది. ఇక సోషల్‌ మీడియాలో అయితే, ఆయనకు లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్నారు. కానీ, ఆయన మాత్రం చాలా తక్కువ మందిని ఫాలో అవుతుంటారు. వారిలో బిగ్‌ బీ అమితాబ్‌, అన్నయ్య చిరంజీవి, తెలంగాణా మంత్రి కేటీఆర్‌.. ఇలా తదితర కొద్ది మంది ప్రముఖలు మాత్రమే ఉంటారు. అయితే, తాజాగా పవర్‌ స్టార్‌ తన ఫాలోవర్స్‌లో మరో కొత్త వ్యక్తిని యాడ్‌ చేసుకున్నాడు. ఆయన మరెవరో కాదు.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌. పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ సినిమాకి థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఇప్పటికే ‘మగువా.. ’ సాంగ్‌తో పవన్‌ కళ్యాణ్‌ మనసు దోచేశాడు థమన్‌.

 

ఇక ఇప్పుడు తన ట్విట్టర్‌ని కూడా పవన్‌ ఫాలో చేస్తుంటే, ఇక థమన్‌ సంతోషానికి ఆకాశమే హద్దనాలి. అలా హద్దుల్లేని ఆకాశమంత ఆనందాన్ని ప్రస్తుతం థమన్‌ ఫీలవుతున్నాడంటే, అందుకు కారణం పవన్‌ కళ్యాణ్‌, థమన్‌ ట్విట్టర్‌ని ఫాలో చేయడమే. ఓ అభిమానికి ఇంతకన్నా గొప్ప సంతోషం ఇంకేముంటుంది.. అంటూ ఈ సంతోషకరమైన విషయాన్ని నెటిజన్స్‌తో పంచుకుని తెగ మురిసిపోతున్నాడు థమన్‌.

ALSO READ: ఇలాగైతే అల్లూవారి ప‌రువు ఏమైపోతుందో..?