ENGLISH

రాజ్‌త‌రుణ్ `స్టాండ‌ప్ రాహుల్‌` స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

11 May 2021-16:30 PM

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `స్టాండ‌ప్ రాహుల్‌`. `కూర్చుంది చాలు` అనేది ట్యాగ్ లైన్‌. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సాంటో మోహన్ వీరంకి ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అవుతున్నారు. రాజ్‌త‌రుణ్ కెరీర్‌లోనే ఒక డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ అంద‌రి దృష్టిని ఆకర్షించింది.

 

ప్ర‌స్తుతం ఇలాంటి జోన‌ర్ సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో పాటు టైటిల్ ఆసక్తికరంగా ఉండ‌డం,స్టైలిష్ మేకోవ‌ర్‌లో యూబ‌ర్‌-కూల్‌గా రాజ్‌త‌రుణ్ ఉన్న ఫ‌స్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ఈ రోజు (మే11) యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `స్టాండ‌ప్ రాహుల్‌` చిత్రం నుండి మ‌రో స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌చేసి శుభాకాంక్ష‌లు తెలిపింది చిత్ర యూనిట్‌. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

 

ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్ర‌ఫి నిర్వ‌హిస్తున్నారు. వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ మ‌రియు మ‌ధురిమ ఇతర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ALSO READ: త‌మిళ హీరోకి... తెలుగులో ఇంత పారితోషిక‌మా?