ENGLISH

రష్మికని ఆడేసుకుంటున్నారుగా.!

12 December 2019-15:17 PM

క్రేజీ భామ రష్మికా మండన్నా 'సరిలేరు నీకెవ్వరు..'లో మహేష్‌తో జోడీ కడుతున్న సంగతి తెలిసిందే. మహేష్‌తో ఆఫర్‌ అంటే రష్మిక అసలు భూమ్మీద నిలవడమే లేదు. చాలా చాలా ఎగ్జయిట్‌ అయిపోతోంది. ఆ ఎగ్జైట్‌మెంట్‌లో ఏం మాట్లాడుతోందో తనకే తెలియడం లేదు.. అయ్యో ఇవన్నీ మా స్వీయాభిప్రాయాలు కాదండోయ్‌. కొందరు ఫ్యాన్స్‌ అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే, 'సరిలేరు..' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక మహేష్‌ని పొగిడేస్తూ, ఆయనతో డాన్స్‌ చేయడం చాలా కష్టమని చెప్పి టంగ్‌ స్లిప్‌ అయ్యింది. అంతే నెటిజన్స్‌ పట్టేసుకున్నారు. మహేష్‌తో డాన్స్‌లకే అలా అంటే, ఇక తదుపరి సినిమాలో అల్లు అర్జున్‌తో డాన్స్‌ చేయాలి. అప్పుడిక ఎలా.? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

 

అయితే, డాన్సుల్లో రష్మిక ఏమంత వీకేం కాదు. ఇంతవరకూ ఆమెకు స్క్రీన్‌ మీద డాన్స్‌ చేసే అవకాశం రాలేదు కానీ, 'డియర్‌ కామ్రేడ్‌' సినిమా ప్రమోషన్స్‌ పేరు చెప్పి నిర్వహించిన 'మ్యూజిక్‌ ఫెస్టివల్‌'లో రష్మిక చాలా గ్రేస్‌ఫుల్‌గా డాన్సులేసిన సంగతి నెటిజన్స్‌ మర్చిపోతున్నారు కాబోలు. ఆమె డాన్సులకు అప్పుడే జనం ఫిదా అయిపోయారు. నిజానికి అప్పుడే రష్మికలో అంత మంచి డాన్సర్‌ ఉందనే నిజం బయట పడింది కూడా. ఇక తదుపరి బన్నీ - సుకుమార్‌ కాంబో మూవీలో రష్మిక అసలు సిసలు డాన్స్‌లు చూడొచ్చన్న మాట.

ALSO READ: సూపర్‌ స్టార్‌తో 'శృతి' కలపనుందా.?