ENGLISH

యాక్ష‌న్ మూడ్ లో... `ఖిలాడీ`

26 January 2021-12:30 PM

ఈ సంక్రాంతికి క్రాక్‌తో సూప‌ర్ హిట్ అందుకున్నాడు.. రవితేజ, ఇదే ఊపులో.. `ఖిలాడీ`నీ మొద‌లెట్టేశాడు. రాక్షసుడుతో ఆక‌ట్టుకున్న‌ దర్శకుడు రమేశ్‌ వర్మ.. `ఖిలాడీ`ని రూపొందిస్తున్నాడు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ పుట్టినరోజు సందర్భంగా 'ఖిలాఢి' సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

 

స్టైలిష్‌ లుక్‌లో రవితేజ పెద్ద సుత్తి పట్టుకుని యాక్ష‌న్ సీన్ కి రెడీ అవుతున్న టీజ‌ర్ ఇది. మాస్ మ‌హారాజా లుక్స్‌, దేవిశ్రీ సంగీతం, వాసుదేవ్ కెమెరా ప‌నిత‌నం.. ఈ టీజ‌ర్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఈ వేస‌విలోగానీ, ద‌సరాకి గానీ సినిమాని విడుద‌ల చేస్తారు.

ALSO READ: ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ప‌ద్మ‌విభూష‌ణ్‌