ENGLISH

రవిబాబు “అదుగో” వస్తున్నాడు

19 August 2018-12:36 PM

నటుడు-దర్శకుడు అయిన రవిబాబు ఆయన దర్శకత్వం వహించే సినిమాలు కాస్త రొటీన్ కి భిన్నంగా ఉండేలా చూసుకుంటాడు. అందులో భాగంగానే ఆయన పంది పిల్లని ముఖ్య పాత్రలో పెట్టి ‘అదుగో’ అనే ఓ చిత్రాన్ని తీసాడు.

ఈ సినిమా ఆయన ఒక సంవత్సరం క్రిందటే పూర్తి చేసినప్పటికి చిత్రాన్ని విడుదల చేసేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ దీనిని అలా పక్కకి పెట్టడం జరిగింది. ఇక ఎట్టకేలకి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రవిబాబుకి ఒక మంచి ముహూర్తం దొరికిందట.

ఆ ముహూర్తం ఎప్పుడంటే ఈ దసరాకి సినిమాని ప్రేక్షకుల ముందుకి తేనున్నారట. హాలిడే సీజన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని విడుదల చేయనుండడం వారి స్ట్రాటజీ అని అర్ధమవుతూనే ఉంది. ఇక ఈ సినిమాలో నటీనటులంతా కొత్తవారే అని సమాచారం.

అదుగో ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు విడుదల చేయనున్నట్టుగా తెలుస్తున్నది.

 

ALSO READ: బిగ్‌బాస్‌ మీద బుక్‌ రాస్తానంటోన్న బిగ్గర్‌ బాస్‌.!