ENGLISH

#RRR కానుక‌... పంద్రాగ‌స్టుకు పండ‌గే!

16 June 2019-13:19 PM

RRR నుంచి అదిరిపోయే అప్ డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా టీజ‌ర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించింది. RRR టీజ‌ర్‌ని ఎప్పుడు తీసుకొస్తారో హింట్ అందేసింది. ఆగ‌స్టు 15న ఈ సినిమాకి సంబంధించిన తొలి ప్ర‌చార చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అందులో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల క్యారెక్ట‌రైజేష‌న్‌ని, గెట‌ప్‌ని పూర్తిగా రివీల్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. తెలుగులోనే కాదు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఈ టీజ‌ర్‌ని ఆ రోజే విడుద‌ల చేయ‌నున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు తెలుస్తోంది.

 

ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌చారం కూడా భారీ ఎత్తున చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్‌. బాహుబ‌లికి ఎలాంటి వ్యూహాలు ర‌చించారో, అలాంటి వ్యూహాల‌తోనే దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాల‌ని, దానికి త‌గ్గ హైప్ క్రియేట్ చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడు. పంద్రాగ‌స్టు టీజ‌ర్‌తో అందుకు తొలి మెట్టు ప‌డ‌బోతోంది. 2020 జూన్‌లో ఈ సినిమాని విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ALSO READ: 'విరాటపర్వం' ఎట్‌ గ్రాండ్‌ లాంఛింగ్‌!