ENGLISH

స‌మంత బొమ్మ‌.. ఇన్నాళ్ల‌కు తెలుగులో

24 February 2021-18:01 PM

స‌మంత తొలిసారి న‌టించిన త‌మిళ చిత్రం `సూప‌ర్ డీల‌క్స్`. మూడేళ్ల క్రిత‌మే ఈ సినిమా విడుద‌లైంది. త‌మిళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అయితే.. తెలుగులో డబ్బింగ్ రూపంలో రాలేదు. ఇన్నాళ్ల‌కు ఈ సినిమాని తెలుగులో డ‌బ్ చేస్తున్నారు. దానికి ఓ కార‌ణం కూడా ఉంది.

 

ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషించాడు. ఓర‌కంగా త‌నే హీరో. ఇటీవ‌ల ఉప్పెన‌తో తెలుగులో మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు విజ‌య్‌సేతుప‌తి. అందుకే.. త‌న ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాల‌న్న ఉద్దేశంతో ఈసినిమాని తెలుగులో డ‌బ్ చేశారు. సిద్దేశ్వర వైష్ణవి ఫిలింస్ సంస్థ ఈ చిత్ర హ‌క్కుల్ని సంపాదించింది.

 

కుమారరాజ త్యాగరాజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో నటించింది. నిర్మాత పి.మధుబాబు ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ALSO READ: Samantha Latest Photoshoot