ENGLISH

అఖిల్‌ హీరోయిన్‌ ఇలా హిట్‌ కొట్టేసింది

17 July 2018-17:56 PM

తొలి సినిమా 'అఖిల్‌'తో దారుణంగా నిరాశ చెందాల్సి వచ్చింది బాలీవుడ్‌ బ్యూటీ సయేషా సెహగల్‌కి. అయితే ఆమెను తమిళ సినీ పరిశ్రమ ఆదుకుంది. అక్కడ వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. 

తాజాగా సయేషా నటించిన తమిళ సినిమా తెలుగులోకి 'చినబాబు' పేరుతో విడుదలయ్యింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ సినిమాకి వసూళ్ళు బాగా వస్తున్నాయని ట్రేడ్‌ పండితులు వెల్లడిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌ కోసం హైద్రాబాద్‌కి వచ్చిన సయేషా, తెలుగు సినిమాతోనే తాను సౌత్‌కి పరిచయమయ్యాననీ, తొలి సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోయినా, అది తనకు బిగ్‌ బిగినింగ్‌ని సౌత్‌లో ఇచ్చిందనే నమ్మకంతో తానున్నానని చెబుతోంది. '

చినబాబు' సినిమాతో తెలుగులోనూ తనకు మంచి గుర్తింపు వచ్చిందంటోన్న సయేషా సెహగల్‌, ముందు ముందు తెలుగు సినిమాల్లో కూడా వరుసగా తనకు అవకాశాలు దక్కుతాయనే ఆశాభావం వ్యక్తం చేసింది. అందానికి అందం, అంతకు మించిన నటనా ప్రతిభ, వీటికి తోడు డాన్సింగ్‌ టాలెంట్‌ - ఇవన్నీ సయేషా సెహగల్‌కి ప్లస్‌ పాయింట్స్‌. అ

క్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్‌ హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా 'అఖిల్‌' బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చవిచూడ్డంతో సయేషాకి మళ్ళీ తెలుగులో ఇంకో అవకాశం రాలేదు. అయితే 'చినబాబు' సినిమా తర్వాత సయేషా కి తెలుగులో అవకాశాల పట్ల పలువురు తెలుగు సినీ దర్శక నిర్మాతలు సానుకూలంగా స్పందిస్తున్నారట.

ALSO READ: మీడియా ముందు తప్పు చేసిన మెగాస్టార్ అల్లుడు