ENGLISH

'తస్సాదియ్యా..' డాన్సుల పండగేనయ్యా.!

17 December 2018-17:35 PM

నో డౌట్‌ మెగాస్టార్‌ తర్వాత డాన్సుల్లో రారాజు మెగా పవర్‌స్టారే అని ఎప్పుడో ప్రూవ్‌ అయిపోయింది. తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తాజా చిత్రం 'వినయ విధేయ రామ' నుండి సెకండ్‌ ఆడియో సింగిల్‌ రిలీజైంది. 'తస్సాదియ్యా.. అదిరింది మామామియ్యా..' అనే ఈ సాంగ్‌లో చరణ్‌ డాన్సింగ్‌ స్టిల్స్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. చరణ్‌కి డాన్సుల్లో కరెక్ట్‌ జోడీ దొరికింది హీరోయిన్‌ కైరా అద్వానీ. కైరా అద్వానీ డాన్సింగ్‌ ఈజ్‌ 'భరత్‌ అనే నేను' సినిమాలో చూశాం. అయితే చరణ్‌ పక్కన ఈ డాన్సింగ్‌ క్వీన్‌ సూపర్‌ స్టైలిష్‌ స్టెప్పులతో మరింత అదరగొట్టేసింది. 

 

డాన్సింగ్‌ స్టిల్స్‌తో పాటు, మేకింగ్‌ వీడియో కూడా విడుదల కావడం, ఆ వీడియోలో చరణ్‌, కైరాతో పాటు, మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఉండడం అభిమానుల్ని మరింత పండగ చేసుకునేలా చేస్తోంది. మొత్తానికి ఈ తస్సాదియ్యా పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మేకింగ్‌ వీడియో కూడా రిలీజ్‌ చేయడంతో వీక్షకులకు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దాంతో విడుదలైన మరుక్షణం నుండే ఈ వీడియోకు లైకులు మీద లైకులు పడుతున్నాయి. 

 

రాకింగ్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందించారు. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఈ సినిమాలో ప్రతినాయకుని పాత్రలో కనిపించనున్నాడు. స్నేహ, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

 

ALSO READ: గ్లామ్‌షాట్‌: బికినీ పంజా విసిరిన 'ఆడపులి'