ENGLISH

సుడిగాలి సుధీర్‌కి క‌రోనా?

21 October 2020-09:36 AM

జ‌బ‌ర్‌ద‌స్త్ తో పాపుల‌ర్ అయిన న‌టుడు సుధీర్‌. సుడిగాలి సుధీర్ గా చాలా ఫేమ‌స్‌. కొన్ని సినిమాల్లోనూ న‌టించాడు. ఇప్పుడు సుధీర్ క‌రోనా బారీన ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం సుధీర్ స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న‌ట్టు స‌మాచారం. లాక్ డౌన్ త‌ర‌వాత‌.. టీవీ షోలూ, కార్య‌క్ర‌మాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. దాంతో సుధీర్ కూడా బిజీగా మారాడు. ఇటీవ‌లే ఈటీవీ ద‌స‌రా స్పెష‌ల్ 'అక్కా ఎవ‌డే అత‌గాడు`‌లో పాల్గొన్నాడు సుధీర్‌. ఆ త‌ర‌వాతే.. క‌రోనా పాజిటీవ్ గా నిర్దార‌ణ అయ్యింద‌ని తెలుస్తోంది.

 

దాంతో ఈ షోలో పాల్గొన్న వాళ్లంతా ఇప్పుడు కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నార‌. అయితే... త‌న‌కు క‌రోనా సోకింద‌న్న విష‌యం సుధీర్ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఇది నిజ‌మో, కాదో తేలాల్సివుంది. ఏదేమైనా సుధీర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, ఎప్ప‌టిలానే న‌వ్వుల్ని పంచాల‌ని బుల్లి తెర ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు.

ALSO READ: బ్ర‌హ్మాజీ పై నెటిజ‌న్లు ఫైర్