ENGLISH

'ట్యాక్సీవాలా' డేట్‌ ఫిక్స్‌ చేసేశాడు

20 October 2018-17:03 PM

'నోటా'తో నిరాశపర్చిన యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, ఈసారి సూపర్‌ హిట్‌ కొడతాననే ధీమాతో ఉన్నాడు. 'ఏడ్చేవాళ్ళెవరైనా ఇప్పుడే ఏడ్చేయండి.. నవ్వేవాళ్ళెవరైనా ఇప్పుడే నవ్వేయండి.. బౌన్స్‌ బ్యాక్‌ అవబోతున్నా.. హిట్టు కొట్టి చూపిస్తా..' అంటూ ఈ మధ్యనే విజయ్‌ దేవరకొండ తన వ్యతిరేకులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెల్సిందే. 

ఇంతలోనే ఈ యంగ్‌ హీరో తన కొత్త సినిమా డేట్‌ని అనౌన్స్‌ చేశాడు. 'ట్యాక్సీ వాలా' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చేసింది 'లీక్‌' రూపంలో. హెచ్‌డీ వెర్షన్‌ని ఎవరో కొందరు అక్రమార్కులు సినిమా రిలీజ్‌కి ముందు సోషల్‌ మీడియాలో వదిలేశారు. దాంతో, పెద్ద రచ్చ జరిగింది. నిందితుడ్ని పట్టుకున్నారు కూడా. ఫుల్‌ వెర్షన్‌, ఉచితంగా అందుబాటులోకి వచ్చేసిన తర్వాత సినిమా విడుదల చేసినా ఉపయోగమేంటి? అని అందరూ అనుకుంటున్న తరుణంలో, డేట్‌ అనౌన్స్‌ చేయడమంటే దానికి చాలా ధైర్యం కావాలి. 

'అత్తారింటికి దారేది' సినిమాకి కూడా ఇలాగే జరిగిందిగానీ, చాలా తక్కువ టైమ్‌లో పైరసీని అరికట్టి, ఆ వెంటనే సినిమాని రిలీజ్‌ చేసేశారు. అయితే, 'ట్యాక్సీ వాలా' సినిమాకి మాత్రం దాదాపు నెల రోజులపాటు గ్యాప్‌ లభించింది.. లీక్‌ అయ్యాక. లీక్‌ సంగతి పక్కన పెట్టి రౌడీస్‌, ఈ సినిమా రిలీజ్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో మళ్ళీ బౌన్స్‌ బ్యాక్‌ అవుతారని వారు ధీమాతో కనిపిస్తుండడం అభినందించగ్గ విషయం. 

నవంబర్‌ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ALSO READ: అర్జున్‌పై శృతి 'మీ..టూ..' ఆరోపణలు