ENGLISH

మెగా ప్రయత్నానికి 8 ఇంటర్నేషనల్ అవార్డ్స్

17 February 2024-19:18 PM

2023 , 24  మెగా కుటుంబానికి కలిసి వచ్చినట్టు ఉంది. వరుస అవార్డ్స్ తో మెగా ఇంట  సంబరాలు జరుగుతున్నాయి. గత ఏడాది మెగా ఇంట వారసురాలు  'క్లింకార' వచ్చింది. నెక్స్ట్   బన్నీకి నేషనల్ అవార్డు వచ్చింది. వైష్ణవ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన బెస్ట్ నేషనల్ ఫిలింగా అవార్డు దక్కించుకుంది. చెర్రీ నటించిన RRR  ని పలు అవార్డ్స్ వరించాయి. ఇక 2024 లో మెగాస్టార్ కి పద్మ విభూషణ్ వచ్చింది. ఇంకా సంబరాలు చేసుకుంటుండగానే, ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, కలర్స్‌ స్వాతిలు నటించిన సోల్ ఆఫ్‌ సత్య సాంగ్‌ ఇంటర్నేషనల్‌ వేదికపై సత్తా చాటి  ఏకంగా ఎనిమిది అవార్డులు గెలుచుకుని రికార్డు స్రష్టించింది.
 

నవీన్ విజయ్‌ కృష్ణ మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్ ఫిలింగా 'సత్య' సాంగ్‌ను రూపొందించారు. ఓ సైనికుడు దేశం కోసం చేసే త్యాగాలను ఇందులో చూపించారు. ఈ సాంగ్ గత ఏడాది  ఆగస్టు 15న విడుద‌లై విమ‌ర్శకుల ప్ర‌శంస‌లను అందుకోవటమే కాదు పలు వేదికలపై ప్రదర్శించగా  అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఫ్రాన్స్‌లో జ‌రిగిన ‘టౌలౌస్ షార్ట్ ఫెస్ట్ 2024’లో ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ న‌టితో స‌హ మొత్తంగా 8 అవార్డులను గెలిచి ఔరా అనిపించింది.
 

‘సత్య’ షార్ట్ ఫిచర్‌ సాంగ్‌ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ ఇండీ పార్ట్ విభాగాల్లో అవార్డులు వరించాయి. సత్య సాంగ్‌ ప్రపంచవేదికగా సత్తా చాటిదంటూ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ టీమ్ ఎక్స్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. దీంతో సత్య సాంగ్‌ టీంకు సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తున్నాయి.