ENGLISH

పవన్ కళ్యాణ్ ఇంటి ముందు హల్చల్

31 August 2017-13:07 PM

మన తెలుగు సినీ హీరోలకి ఉన్న అభిమాన సంఘాల గురించి ఘనంగానే చెప్పుకోవాలి. వారు చేపట్టే సామజిక కార్యక్రమాలని కింది స్థాయి వరకు తీసుకెళ్ళే ముఖ్యమైన కార్యక్రమాన్ని వారు దిగ్విజయంగా చేపడుతుంటారు.

అయితే అందరు అభిమానులు ఒకేలా ఉండరు కదా అందుకే కొంతమంది ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలని తమ చేష్టల ద్వారా ఇబ్బంది పెడుతుంటారు. అందుకు తాజాగా ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ ఇంటి ముందు జరిగిన సంఘటనే పెద్ద ఉదాహరణ.

జ్యోతి అనే మహిళ నేటి ఉదయం ప్రశాసన్ నగర్ లోని పవన్ ఇంటి ముందు ఆయనని కలవాలని హంగామా సృష్టించింది. ఈ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఆమెని అదుపులోకి తీసుకున్నారు.

ఆమె గత కొన్నిరోజులుగా పవన్ కళ్యాణ్ ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది, అయితే ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని చెబుతున్నారు.

ఈ ఉదంతం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ ఇంటిలో లేకపోవడం కొసమెరుపు.

ALSO READ: యంగ్ హీరో పెళ్ళి ఆగిపోయింది