ENGLISH

అబిజీత్‌ మీద పెరుగుతోన్న నెగెటివిటీ.. కారణమిదే.!

29 October 2020-15:00 PM

సినీ నటుడు అబిజీత్‌, బిగ్‌బాస్‌ ద్వారా పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఈ సీజన్‌కి సంబంధించి వన్‌ ఆఫ్‌ ది స్ట్రాంగెస్ట్‌ కంటెస్టెంట్‌గా, టైటిల్‌ ఫేవరెట్‌గా వున్న అబిజీత్‌ క్రమక్రమంగా నెగెటివిటీని కూడా పెంచుకుంటూ పోతున్నాడు తన చేష్టలతో. ఆయా కంటెస్టెంట్స్‌తో అభ్యంతకరమైన బిహేవియర్‌తో అబిజీత్‌ తన ఇమేజ్‌ని పాడు చేసుకుంటున్నాడనే విమర్శలున్నాయి. అయితే, అబిజీత్‌ని నెగెటివ్‌గా చూపించేందుకోసం అందుకు అనుగుణంగా సన్నివేశాలు చూపిస్తున్నారన్న కంప్లయింట్‌ అబిజీత్‌ అభిమానుల నుంచీ వినిపిస్తోంది. పీఆర్‌ టీం పరంగా చూసుకుంటే, అబిజీత్‌ మిగతా కంటెస్టెంట్స్‌ కంటే చాలా వేగంగా వున్నాడని నిస్సందేహంగా చెప్పొచ్చు.

 

కాగా, ఫిమేల్‌ కంటెస్టెంట్స్‌తో అబిజీత్‌ బిహేవియర్‌ అస్సలు నచ్చడంలేదు ఫ్యామిలీ ఆడియన్స్‌కి. మోనాల్‌ గజ్జర్‌ ఆలోచన ఏదైనా, ఆమె ఏడవడానికి అఖిల్‌తోపాటు అబిజీత్‌ కూడా ఓ కారణమేనన్న అభిప్రాయం ఫ్యామిలీ ఆడియన్స్‌లో బలపడిపోయింది. ఇంకోపక్క హారిక విషయంలో కూడా అబిజీత్‌ బిహేవియర్‌ ఫియమేల్‌ ఆడియన్స్‌కి నచ్చడంలేదు. ఎలా చూసినా అబిజీత్‌ పట్ల నెగెటివిటీ ఈ మధ్య బాగా పెరిగిపోతోందనే చర్చ బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌లో జరుగుతోంది. ఇంకోపక్క ఈ షోని హోస్ట్‌ చేస్తున్న నాగార్జునతోపాటు, గెస్ట్‌ హోస్ట్‌ అయిన సమంత కూడా అబిజీత్‌ని టార్గెట్‌ చేయడం గమనార్హం. హీరో అఖిల్‌, గెస్ట్‌గా వచ్చి, అబిజీత్‌ డాన్స్‌ మీద సెటైర్లు వేయడం కూడా గమనించాల్సిన విషయమే.

ALSO READ: కరోనా వైరస్‌కి సవాల్‌ విసురుతున్న టాలీవుడ్‌