ENGLISH

అభిజిత్ కి ప్రైజ్ మ‌నీ కంటే అదే ఎక్కువ‌..!

23 December 2020-12:00 PM

బిగ్ బాస్ 4 విన్న‌ర్ గా నిలిచాడు అభిజిత్‌. ప్రైజ్ మ‌నీ 50 ల‌క్ష‌లు అయినా - సోహైల్ టాప్ 3లో ఉన్న‌ప్పుడు 25 ల‌క్ష‌ల‌తో.. సోహైల్ త‌ప్పుకోవ‌డంతో.. ప్రైజ్ మ‌నీలో కోత ప‌డింది. చివ‌రికి అభిజిత్ కి 25 ల‌క్ష‌లే ద‌క్కాయి. కాక‌పోతే.. `బిగ్ బాస్ విజేత‌` అనిపించుకున్నాడు. అయితే.. రోజువారీ పారితోషికం పేరుతో అభిజిత్ కి బాగానే ముట్టిన‌ట్టు తెలుస్తోంది. వారానికి అభిజిత్ పారితోషికం 4 ల‌క్ష‌ల‌ని స‌మాచారం.

 

ఆ రూపంలో దాదాపుగా 60 ల‌క్ష‌ల వ‌ర‌కూ అభిజిత్ కి అందాయ‌ని తెలుస్తోంది. అంటే... 85 ల‌క్ష‌ల వ‌ర‌కూ గిట్టుబాటు అయ్యింద‌న్న‌మాట‌. పైగా బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత‌.. సినిమా అవ‌కాశాలు ఎలాగూ వ‌స్తాయి. ఇలా ఏ రూపంలో చూసినా.. అభిజిత్ కి బిగ్ బాస్ వ‌ల్ల ప్ల‌స్సే అయ్యింది. ఆ పాతిక ల‌క్ష‌లు కూడా సోహైల్ ప‌ట్టుకెళ్ల‌క‌పోతే... కోటికి పైనే ఆర్జించేవాడు. ఒక్క షోతో కోటీశ్వ‌రుడు అయ్యేవాడు.

ALSO READ: 'స‌లార్‌'... షూటింగ్ ఎప్పుడంటే...?